హైదరాబాద్ లోని మాదాపూర్ లో డన్యోన్ టెక్నాలజీ బోర్డు తిప్పేసింది. వంద మందికి పైగా ఉద్యోగుల నుంచి రూ.లక్ష నుంచి రూ.2లక్షలు వసూలు చేశారు. ఫేస్ బుక్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కావాలంటూ ప్రకటన ఇచ్చారు. ప్రకటన చూసి నిరుద్యోగులు నమ్మి మోసపోయారు. టెలిఫోన్ లోనే ఇంటర్వ్యూ చేసి ఆఫర్ లెటర్ జారీ చేశారు. మోసగాళ్లు ఆన్ లైన్ లో ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ తర్వాత ప్రాజెక్టు ఇస్తామంటూ కంపెనీ ప్రతినిధులు నమ్మించారు. ఒక్కో వ్యక్తికి రూ.4లక్షలు ప్యాకేజీని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. బాధితులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కంపెనీ ప్రతినిధి ప్రతాప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement