హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఈక్రమంలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ కిలాడీ లేడీ తంబా ఫిడెల్మా నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొ-కై-న్‌ను సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నైజీరియన్ కిలాడీ లేడీని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు వివరించారు.
నైజీరియన్ మహిళ నలుగురు సభ్యులతో ముఘా ఏర్పాటు చేసుకుని బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో నైజీరియన్ మహిళ భర్తతో పాటు మరో ముగ్గురు నగరంలోని ప్రముఖులకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గత కొంత కాలంగా నగరంలోని రాజేందర్‌నగర్, సన్‌సిటీ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతోందని, నిందితులపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియాకు చెందిన తంబా ఫిడెల్మాను అరెస్ట్ జైల్‌కు తరలించారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలు తంబా ఫిడెల్మా తన ముఠా సభ్యులతో ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా వినియోగదారులలో ప్రముఖులు ఉన్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలినట్లు సమాచారం.