హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాదక ద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు డిసౌజాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గోవా కేంద్రంగా డిసౌజా ఎలియాస్ స్టీవ్ మాదకద్రవ్యాల వ్యాపారం సాగిస్తున్నాడు. ఆగస్టు 16న కాళీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా ఆయన ఇచ్చిన సమాచారంతో డిసౌజాను పట్టుకున్నట్లు హైదరాబాద్ నగర టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తి చెప్పారు. డిసౌజా దేశ వ్యాప్తంగా 600మందికి మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారని, హిల్‌టాప్ రెస్టారెంట్‌లో డ్రగ్స్ డెన్‌ను గుర్తించామని తెలిపారు.
ఏజెంట్లను ఎంపిక చేసుకుని వారి ద్వారా మాదకద్రవ్యాలను పంపిణీ చేసేవారని, హైదరాబాదులో 168మందికి డిసౌజా తన డెన్ ద్వారా డ్రగ్స్ ను అందించేవారని చెప్పారు. న్యాయస్థానం అనుమతితో డిసౌజాను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని చక్రవర్తి వివరించారు.