Friday, November 22, 2024

డ్రైనేజి, మంచినీటి సమస్యలు..

కవాడిగూడ : ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని రాంనగర్‌, అడిక్‌మెట్‌ డివిజన్‌లలోని వివిధ బస్తీలలో డ్రైనేజి, మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముషీరాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ వాటర్‌వర్స్క్‌ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని రాంనగర్‌, అడిక్‌మెట్‌ డివిజన్‌లోని వివిధ బస్తీలలో పర్యటించి డ్రైనేజీ, మంచినీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ బస్తీలలో డ్రైనేజి, కలుషితనీటి సరఫరా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. పెరిగిన జనాభాకనుగుణం గా ఆయా బస్తీలలో నూతన పైప్‌లైన్‌లు వేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. గత కొన్ని రోజులుగా డ్రైనేజీ పొంగిపోర్లుతోందని, తాగునీటిలో కలుషిత నీటి సర ఫరా జరుగుతోందని ఆయన వెల్లడించారు. బస్తీలలోని సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో టిఆర్‌ఎస్‌ నాయకులు వాటర్‌వర్క్స్‌ అధికారులు తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement