హైదరాబాద్: తుకారం గేట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) లాలాపేట్, ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (HDS) మీటింగ్ లో మౌలిక వసతుల్లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆస్పత్రి వైద్య సిబ్బంది, డాక్టర్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వైద్య సిబ్బందికి ఆస్పత్రిలో కనీస మౌలిక సదుపాయాలు లేవని, డ్రెస్సింగ్ రూమ్, బాత్ రూమ్, మంచినీరు, బోర్ వాటర్, వివిధ రోగాల బారిన పడిన రోగులకు కూడా బాత్రూంలు లేవని డిప్యూటీ మేయర్ కు తమ సమస్యలను విన్నవించుకున్నారు. స్పందించిన శ్రీలత శోభన్ రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సదస్సులో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ (SPHO)డాక్టర్ రాజశ్రీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌశీల్య రాణి, టీఆర్ఎస్ నాయకులు శైలజ, వనజ లక్ష్మి, ఎస్ ఎల్ ఎఫ్ మెంబర్స్, ఎంపీ హెచ్ ఎస్ లీడర్స్, వార్డ్ మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.