Friday, November 22, 2024

జ్వ‌రం, జ‌లుబు ఉన్న వారికి హోం ఐసోలేష‌న్ కిట్ల పంపిణీ : మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ

జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలున్నవారికి హోమ్ ఐసోలేష‌న్ కిట్లు పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని న‌గ‌ర మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మీ తెలిపారు. శుక్ర‌వారం బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్ లో ఫీవర్ సర్వే ను డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ అమోహ్, రవికాంత్ డీఎంహెచ్ఓ అనురాధ, ఇతర అధికారులతో క‌లిసి ప‌రిశీలించారు. ఈసంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచనలతో ఈరోజు నుండి ఫీవర్ సర్వే ప్రారబించడం జరిగిందన్నారు. గతంలో రెండు సార్లు నిర్వహించిన అనుభవంతో ఈ సారి కూడా వైద్య సిబ్బంది, మున్సిప‌ల్ సిబ్బంది కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆదేశించారు.

అలాగే ఆర్టీపీసీఆర్ టెస్ట్ లకు ప్రైవేట్ హాస్పిటళ్ల‌లో, ల్యాబ్ లలో రూ.500లు మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. కావున ఎవరైనా ఎక్కువగా కలెక్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 60 ఏళ్ల పై పడిన వారందరూ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. అలాగే వ్యాక్సినేషన్ రెండవ డోస్ తీసుకోని వారందరూ తప్పనిసరిగా తీసుకోవాల‌న్నారు. రెండవ డోసు తీసుకున్న 9 నెలల తరువాత బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. నగర ప్రజలు మాస్క్ ధ‌రిస్తూ సోష‌ల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. 6 రోజుల్లో బస్తీల్లో 15 రోజుల మిగిలిన ప్రాంతాల్లో ఫీవర్ సర్వే పూర్తి చేస్తామని, కిట్స్ ఇవ్వడంతో పాటు కొన్ని చోట్ల రాపిడ్ టెస్ట్ లు చేయాలని మేయ‌ర్ ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement