Friday, November 22, 2024

హీమోఫిలియా బాధితులకు.. రూ.12లక్షల ఉచిత మందుల పంపిణీ

హైదరాబాద్ : హీమోఫిలియా వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు హీమోఫిలియా హైదరాబాద్ సోసైటీ అండగా నిలుస్తోంది. త్వరలో జరుగబోయే పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే 24మంది హీమోఫిలియా బాధితులకు 12లక్షల విలువ చేసే మందులను హీమోఫిలియా హైదరాబాద్ సొసైటీ ఆధ్వర్యంలో నిమ్స్‌ ఆసుపత్రిలో హీమోటాలజీ వైద్యనిపుణులు డాక్టర్ రాధిక, ఫిజియోథెరపి వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్ చేతుల మీదుగా అందించారు.

పబ్లిక్ పరీక్షల సమయంలో బాధిత విద్యార్థులకు రక్తస్రావాన్ని నివారించి పరీక్షలు విజయవంతంగా ముగించుకునేందుకు నిమ్స్‌ హీమోటాలజీ విభాగం వైద్యుల పర్యవేక్షణలో హైదరాబాద్ సొసైటీ ఎంపిక చేసిన వివిధ జిల్లాలకు చెందిన 24మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి సుమారు 50వేల రూపాయల విలువ చేసే ఫ్యాక్టర్ 8, 9 ఇంజిక్షన్‌లను హీమోఫిలియా సోసైటీ ఆప్ ఇండియా ఉచితంగా పంపించింది. ఈ ఉచిత ఫ్యాక్టర్ ఇంజిక్షన్‌లను నిమ్స్‌ హీమోటాలజీ, ఫిజియోథెరపీ వైద్య నిపుణుల చేతుల మీదుగా అందించారు. హీమోఫిలియా బాధిత విద్యార్థులు ఉచిత మందులను సద్వినియోగం చేసుకుని విజయవంతంగా పరీక్షలకు హాజరై ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని వైద్యులు, హీమోఫిలియా సొసైటీ ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హీమోఫిలియా హైదరాబాద్ సోసైటీ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్ర, ఉపాధ్యక్షులు అబ్దుల్ రజాక్, హీమోఫిలియా సౌత్ రీజియన్ కోఆర్డినేటర్ వంశీకృష్ణ, ప్రతినిధులు రామకృష్ణ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement