Monday, November 18, 2024

ఆగస్టు మొదటివారం నుంచి డబుల్ ఇండ్ల పంపిణీ: మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తున్నదని, ఇప్పటికే ఇందులో అత్యధిక భాగం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. మిగిలిన చోట్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయన్నారు.

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి సంబంధించి జిహెచ్ఎంసి ఒక షెడ్యూల్ సిద్ధం చేసింది. లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి సంబంధించిన అంశంలో రెవెన్యూ యంత్రాంగం నుంచి మద్దతు తీసుకొని ముందుకుపోనున్నది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మార్గదర్శకాలు మేరకు ఈ ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement