Saturday, November 23, 2024

సెల్‌ ఫోన్‌ పోయిందా, చోరీకి అయ్యిందా?.. డోంట్ వ‌ర్రీ అంటున్న‌ డీజీపీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైన సెల్‌ఫోన్ల ను గుర్తించేందుకు సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (సిఇఐఆర్‌) అనే కొత్త విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్టు డీజీపీ అంజనీ కుమార్‌ ప్రకటించారు. ఈ సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ- రిజిస్టర్‌ విధానంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన అవగాహన కల్పించారు. టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ రాజశేఖర్‌, డైరెక్టర్లు మురళి కృష్ణ, రాఘవ రెడ్డి , అడిషనల్‌ డీజీ మహేష్‌ భగవత్‌లతో కలిసి మంగళవారం నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్‌ డీజీలు అనిల్‌ కుమార్‌, షికా గోయల్‌, సంజయ్‌ కుమార్‌ జైన్‌, శివధర్‌ రెడ్డి, అభిలాష బిస్త్‌, ఐజీలు కమలాసన్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, షానవాజ్‌ కాసీం, డీఐజీ రమేష్‌ రెడ్డి, ఎస్పీలు లావణ్య, విజయ్‌ కుమార్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ అత్యధికంగా ఉపయోగించే ఎలక్ట్రాన్రిక్‌ గాడ్జెట్‌లలో సెల్‌ ఫోన్‌ ప్రధానంగా మారిందని, ఈ నేపథ్యంలో సెల్‌ ఫోన్‌ల చోరీ, మిస్సింగ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. పోయిన సెల్‌ ఫోన్‌లను గుర్తించేందుకు ప్రవేశ పెడుతున్న సీఈఐఆర్‌ పై సామాన్య ప్రజల్లో గ్రామాలలో, పట్టణాలలో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రపంచ టెలికాం దినోత్సవంగా మే 17న ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. అడిషనల్‌ డీజీ మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 750 పోలీస్‌ స్టేషన్లలో పోలీస్‌ అధికారులకు ఈ నూతన విధానంపై శిక్షణనిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

సెల్‌ ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరికీ సీఈఐఆర్‌ గురించి తెలిసేలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సర్కిల్‌, డివిజన్‌ పరిధిలో బ్లూ కోల్డ్స్‌ పెట్రో కార్‌ సిబ్బంది ప్రతిరోజు అవగాహన కల్పించాలని తెలిపారు. సెల్‌ ఫోన్‌ పోయిందని ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌కు వస్తే సంబంధిత రిసెప్షనిస్ట్‌ సెంట్రల్‌ ఎక్విప్మెంట్‌ ఐడెంటిల్‌ రిజిస్టర్‌ యాప్‌లో పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. సెల్‌ ఫోన్‌ ,చరవాణి ఎక్కడైనా పడిపోయిన ఎవరైనా దొంగలించుకుని పోయిన వెంటనే సీఈఆర్‌ లో రిజిస్ట్రేష్రన్‌ చేస్తే దొరికే అవకాశం ఎక్కువగా ఉంటు-ందన్నారు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ సీఈఆర్‌ అనే అప్లికేషన్‌ ద్వారా చరవాణి ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా వాటిని వెతికి పట్టు-కోవడానికి ఎంతో చేయూతనిస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement