అన్ని వర్గాలను సమానంగా భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సనత్ నగర్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటరు నమోదులో పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు మన జన్మ హక్కుగా భావించాలన్నారు. సనత్ నగర్ ఇండస్ట్రీ ప్రాంతం నుంచి బాలానగర్ సర్కిల్ వరకు అండర్ పాస్, ఫతే నగర్ ప్లై ఓవర్ విస్తరణ పనుల కోసం రూ. వంద కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement