అభివృద్ధికి చిరునామా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని మాజీ కార్పొరేటర్లు సామ తిరుమల్ రెడ్డి, భవాని ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కర్మన్ ఘాట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులతో కలిసి వారు మాట్లాడుతూ… రూ.3292 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే పక్ష నాయకులకు అగుపడుతలేవా అని వారు విమర్శించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై మూడు సంవత్సరాల క్రితం బిజెపి కార్పొరేటర్లు గెలిచి ఏం సాధించారు.. అభివృద్ధిపై ప్రజల మధ్య తేల్చుకుందామని వారన్నారు. ఏనాడైనా ప్రజా సమస్యల పట్టించుకున్నారా అని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన తర్వాత నాలుగు రోజులకు తిరిగి కొబ్బరికాయలు కొట్టి కాంట్రాక్టర్లను ఇంటికి పిలిపించి కమిషన్లు తీసుకుంటున్నది మీరు కాదా అని వారన్నారు.
ప్రతిపక్ష నాయకులు గోరంతను కొండంత చూయించి మాట్లాడడం సరైనది కాదన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన ఘనత సుధీర్ రెడ్డికే దక్కిందన్నారు. ప్రతిపక్ష నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని వారు హెచ్చరించారు. ఫ్రూట్ మార్కెట్ ను తరలించి ఆసుపత్రి నిర్మిస్తున్నది అగుపించడం లేదా అన్నారు. 118 జీవో ద్వారా అనేకమంది లబ్ధి పొందారని తెలిపారు. 58, 59 జీవో ద్వారా రిజిస్ట్రేషన్లు అయ్యాయని తెలిపారు. బట్ట కాల్చి మీద వేయడం సరైనది కాదన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, భవానీ ప్రవీణ్ కుమార్, కొప్పుల విఠల్రెడ్డి, పద్మనాయక్, సాగర్, విఠల్ రెడ్డి, తిరుమలరెడ్డి, సంగీత, సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, హనుమాన్ దేవాలయం ధర్మకర్త నల్ల రఘుమారెడ్డి, డివిజన్ అధ్యక్షులు సత్యం చారి, రాజ్ కుమార్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి, బొంబాయి, చిరంజీవి, ఉదయ్ కుమార్ రెడ్డి, నాగిరెడ్డితో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.