Friday, November 15, 2024

చిన్నారుల్లో లోపాల‌ను గుర్తించ‌డం టిఫా స్కానింగ్ తోనే సాధ్యం.. హ‌రీశ్ రావు

100 మందిలో ఏడుశాతం శిశువుల్లో లోపాలుంటాయని, వాటిని టీఫా స్కాన్స్‌తోనే గుర్తించడం సాధ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సర్కారు దావాఖానల్లో గర్భిణుల సౌకర్యార్థం కొత్తగా ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్‌ మిషన్లను మంత్రి హ‌రీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 56 టిఫా స్కానింగ్‌ యంత్రాలను పేట్ల బురుజు ఆసుపత్రి నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… టిఫా స్కానింగ్‌ మిషన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పేట్ల బురుజు ఆసుపత్రిలోనే కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారని, రాష్ట్రంలో 99.2శాతం ఇన్‌స్టిట్యూషనల్‌ డెలివరీలు జరిగాయన్నారు. రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇందులో భాగంగానే రూ.20 కోట్ల వ్యయంతో 44 ప్రభుత్వ హాస్పిటళ్లలో 56 అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement