Tuesday, November 26, 2024

ఈ డిజైన్ డెమోక్రసీలో డిజైనర్లకు తెలుసుకునేందుకు చాలా వుంది… జయేష్ రంజన్

హైదరాబాద్ : డిజైనర్లకు తెలుసుకోవడానికి ఎంతో ఈ డిజైన్ డెమోక్రసీ లో వుందని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. హైదరాబాద్‌లో మొట్ట మొదటి లగ్జరీ డిజైన్ ఫెస్టివల్‌ ను డిజైన్ డెమోక్రసీ ప్రారంభించింది. ఈ ప్రదర్శనను పింకీ రెడ్డి ప్రారంభించగా, కాన్ఫరెన్స్ ఏరియాను క్రెడాయ్ నేషనల్, సెక్రటరీ జి.రామ్ రెడ్డి, ప్యానెల్ డిస్కషన్ ను తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. పొన్ని ఆస్కార్ (ఆర్కిటెక్ట్) అలేఖ్య హోమ్స్‌కు చెందిన శ్రీనాథ్ కుర్ర తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డిజైన్ డెమోక్రసీ అనేది ప్రముఖ డిజైన్ క్యూరేటర్ అయిన అర్జున్ రాఠీ, అభిరుచి కలిగిన ద్వయం శైలజా పట్వారీ అండ్ పల్లికా శ్రీవాస్తవ్‌ ఆలోచన.

ప్రదర్శన క్యూరేటర్ అర్జున్ రాఠీ మాట్లాడుతూ… డిజైన్ డెమోక్రసీ అనేది ఒక ఈవెంట్ కంటే ఎక్కువ, ఇది ఒక ఉద్యమమ‌న్నారు. ఇది డిజైన్ వేడుక, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూస్తున్న, అభినందిస్తున్న విధానాన్ని మార్చే వాగ్దానమ‌న్నారు. జయేష్ రంజన్ మాట్లాడుతూ… డిజైన్ కు ఈ రోజు చాలా ప్రాధాన్యత వుందన్నారు. విభిన్న డిజైన్ లతో నిర్వహిస్తున్న ఈ డిజైన్ డెమోక్రసీ అద్భుతంగా వుందన్నారు. చక్కటి సృజనాత్మకత ఇక్కడ చూడగలుగుతున్నామన్నారు. ఇక్కడ తెలుసుకోవడానికి ఎంతో వుందన్నారు. ఔత్సాహిక డిజైనర్ల తో పాటుగా, అనుభజ్ఞుల కోసం మ్యూజియం అఫ్ తెలంగాణ అని ఇక్కడ ఏర్పాటు చేయటం బాగుందన్నారు. దీని ద్వారా మరింతగా తెలుసుకోవచ్చని, ఈ ప్రదర్శన మంచి ప్రయత్నమ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement