Wednesday, January 8, 2025

HYD | కవిత ధర్నాతో ఇందిరాపార్క్ అపవిత్రం : పిడమర్తి రవి

ఇందిరాపార్కులో బీఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత బీసీ మహాసభ నిర్వహించ‌డంతో… ఇందిరాపార్కు, బీసీ వాదం అపవిత్రమైంద‌ని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో కల్వకుంట్ల కవిత బీసీ మహాసభ నిర్వ‌హించిన‌ ప్రదేశంలో పాలతో శుద్ధి చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని హామీ ఇచ్చి.. దళితులను తీవ్రంగా అణగదొక్కిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దళితులను ముఖ్యమంత్రిని చేయకుపోగా.. మంత్రివర్గంలో ఒక్క మాదిగకు కూడా చోటు కల్పించకుండా దళితులను తీవ్రంగా అణగదొక్కిన నియంత కేసీఆర్ అని అన్నారు.

ఇప్పుడు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బీసీ వాదం ఎత్తుకుని బీసీలను నమ్మి అణచివేసే ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు. బీసీ సోదరులు దయచేసి కల్వకుంట్ల కుటుంబం మాయ‌లో పడవద్దని అన్నారు. దళితులను మోసం చేసినట్లే బీసీలను మోసం చేస్తారని అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు గుర్తుకు రానీ సావిత్రిబాయి పూలే… అధికారం కోల్పోయాక ఎందుకు గుర్తొచ్చారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో నియంత కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కుటుంబ మాత్రమేనని… అలాంటి కల్వకుంట్ల కుటుంబ నాటకాలను నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర బీసీ, ఎస్సీలు లేరని అన్నారు.

కల్వకుంట్ల కుటుంబ పాలనలో ధర్నా చౌక్ లేదని హుకుం చారి చేసిన కెసిఆర్ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం ఏ ముఖం పెట్టుకొని ఇందిరాపార్కులో ధర్నా చేస్తుందని అన్నారు. సబ్బండ వర్గాలు తమ అస్తిత్వం కోసం పోరాటం చేసే వేదిక ఈ ధర్నా చౌక్ అని… ఇంత పవిత్రమైన స్థలాన్ని కల్వకుంట్ల కవిత వచ్చి అపవిత్రం చేసిందని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వక్కళ్ళగడ్డ చంద్రశేఖర్, ఎండి రహీం, నండ్రు నరసింహ, బోరెల్లి సురేష్, పాతకోటి కరన్,దర్శనం జాన్, శ్రీనాథ్, దేవరకొండ నరేష్ జోగు గణేష్, మీసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement