హైదరాబాద్ : సాధ్యమైనంత ఎక్కువ మందికి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న డానోన్ ఇండియా పసిపిల్లల పోషకాహార పరిధిని బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తూ ఆప్టాగ్రో ను జాతీయ స్థాయిలో విడుదల చేసింది. 3-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల పోషకాహార అవసరాన్ని 37 పోషకాలతో ఆప్టాగ్రో తీరుస్తుంది. ఇది ప్రీబయోటిక్స్ ప్రత్యేకమైన సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది పిల్లల ఎదుగుదల, మెదడు అభివృద్ధి, రోగనిరోధక శక్తిని అందించడానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.
ఈసందర్భంగా డానోన్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీరామ్ పద్మనాభన్ మాట్లాడుతూ… డానోన్‌లో, వీలైనంత ఎక్కువ మందికి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని అందించాలని తాము విశ్వసిస్తున్నామన్నారు. పిల్లల ఎదుగుదలకు సంబంధించి ఆరంభ సంవత్సరాల్లో సరైన పునాదిని కలిగి ఉండటం ముఖ్యమన్నారు. తల్లులందరూ తమ పిల్లలకు ఉత్తమమైన పోషకాహారాన్ని అందించాలని తహతహలాడుతున్నప్పటికీ, పోషకాహారం బాగా గ్రహించడం చాలా ముఖ్యమన్నారు. ఒక స్వతంత్ర సర్వే ఆధారంగా 69శాతం మంది తల్లులు తమ పిల్లలు ఆశించిన విధంగా ఎదగడం లేదని భావించారన్నారు. 73శాతం మంది పోషకాలను సరిగా గ్రహించలేకపోవడం వల్ల ఎదుగుదల సరిగా ఉండటం లేదని నమ్ముతున్నారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము రూపొందించిన ఆప్టాగ్రోను విడుదల చేస్తున్నామన్నారు. ఇది 37 ముఖ్యమైన పోషకాలను అందిస్తుందన్నారు.