Friday, November 22, 2024

కరోనా నుంచి కోలుకున్నసీఎస్ సోమేశ్ కుమార్

హైద‌రాబాద్ : రాష్ర్ట ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ క‌రోనా నుంచి కోలుకున్నారు.. ఈ నెల 6వ తేదీన సీఎస్ ‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.. అప్పటి నుంచి ఆయ‌న ఐసోలేష‌న్ లో చికిత్స చేయించుకు న్నారు. నేడు మ‌రోసారి ఆయ‌న క‌రోనా ప‌రీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. దీంతో నేటి నుంచి అన్ని శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో సీఎస్ స‌మావేశం కానున్నారు. ముందుగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో సీఎస్ సోమేష్ కుమార్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాలలో కరోనా టెస్టులు పెంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అటు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా రోగుల కోసం బెడ్లు పెంచాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు వ్యాక్పినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ కోరారు. ఈ సమావేశంలో మెడికల్ హెల్త్ సెక్రటరీ రిజ్వీ,మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ డ్రగ్ కంట్రోలర్ డా.రమేష్ రెడ్డి, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement