Monday, November 25, 2024

వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు..

షాద్‌నగర్ : వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నూతన విద్యుత్‌ చట్టాలతో పాటు పెరిగిన వంట గ్యాస్‌, డిజిల్‌ , పెట్రోల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తు రైతు సమన్వయ సంఘం ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపులో భాగంగా షాద్‌నగర్‌లో బంద్‌ కార్యక్రమాన్ని సిపిఐ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ 120 రోజులుగా దేశంలో రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పోరాడుతుంటే మోడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం దుర్మార్గమని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటికరించడం బాధకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, సిపిఐ మండల కార్యదర్శి శ్రీను, కేశంపేట మండల కార్యదర్శి గోవింద్‌ నాయక్‌, సిపిఐ నాయకులు చంద్రబాబు, విఠల్‌ యాదవ్‌, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు దశరత్‌, ఖలీం, మల్లేష్‌, రాజు, రాము, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement