హైదరాబాద్ నగరంలో కరోనా రోగులను క్యాష్ చేసుకుంటున్న అంబులెన్స్ డ్రైవర్లకు రాచకొండ సీపీ మహేష్ భగవత్ హెచ్చరికలు జారీ చేశారు. అంబులెన్స్ యజమానులు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కీసర నాగారం నుంచి హయత్‌నగర్ వరకు ఓ అంబులెన్స్ డ్రైవర్ రూ.1.60 లక్షల వసూలు చేశాడని, అతడిని పిలిచి వార్నింగ్ ఇచ్చి డబ్బులు రిటర్న్ ఇప్పించామని వివరించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, రెమ్‌డెసివిర్ అధిక ధరలకు బ్లాక్‌లో అమ్ముతున్న 30 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. కాగా లాక్‌డౌన్ కారణంగా అత్యవసరాలకు దరఖాస్తు చేసుకున్న రోజునే ఈ-పాసులు ఇస్తున్నామని, మూడు రోజులు మాత్రమే అవి చెల్లుబాటు అవుతాయని, తర్వాత రెన్యూవల్ చేసుకోవాలని సీపీ సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement