రెండో విడతలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు రష్యా నుంచి హైదరాబాద్ చేరాయి. రెండో విడతలో 1.50లక్షల డోసులు ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్ ల్యాబ్‌కు తరలించారు. 67లక్షల డోసులు కావాలని కంపెనీ ఆర్‌డీఐఎఫ్‌ను కోరగా.. రష్యా వాటిని విడుదల వారీగా పంపిస్తోంది. సోమవారం నుంచి దేశంలో టీకా పంపిణీ ప్రారంభం కానుంది. జూన్ నుంచి దేశంలోనే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు రెడ్డీస్ ల్యాబ్ ఇప్పటికే ప్రకటించింది. టీకాను రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement