హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి షా నవాజ్ ఖాసీం భార్య హీనాకు కోవిడ్ వ్యాక్సిన్ వికటించింది. కింగ్ కోఠీలోని ఏరియా ఆస్పత్రిలో ఆమె వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ఆమె కళ్లు తిరిగి పడిపోఆయరు.. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉస్మానియాలో చికిత్స పొందుతున్న హీనాను పరామర్శించారు. ఆమె పరిస్థితి, వైద్య సేవలపై ఆరాతీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కాగా, ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైద్య పరీక్షలకు సహకరిస్తున్నారని వైద్యులు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement