కవాడిగూడ : కరోనా పూర్తిగా తగ్గే వరకు దయచేసి ఎవరూ బయిటికి రావద్దని కవాడిగూడ మున్సిపల్ డివిజన్ కార్పొరేటర్ జి రచనశ్రీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దోమలగూడలోని కార్పొరేటర్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరోనా వైరస్‌పై అవగాహాన కలిగి ఉన్నారని, పూర్తిగా అరికట్టాలంటే ఇండ్లకు పరిమితం కావడం ఒక్కటే మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ను అరికట్టేందుకు అహార్నిషలు కృషి చేస్తున్నాయని, అందుకు తమవంతు సహాకారం ప్రజలు అందించాలన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె సూచించారు. నిత్యవసర వస్తువుల కొనుగోలు నిమిత్తం, అత్యవసరాలకోసం మాత్రమే బయటకు రావాలని సూచించారు. కరోనా వైరస్ భారిన పడకుండా ప్రతిఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. అత్యవసర సేవలు అందిస్తున్న పోలీసులు, వైద్యులు, మున్సిపల్ తదితర శాఖ ల వారికి కృతజ్ఞతలు తెలిపారు.
దయచేసి బయట తిరగవద్దు.. కార్పొరేటర్..
By sree nivas
- Tags
- corona
- corporator
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- rachana sree
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement