Tuesday, November 19, 2024

క‌రోనా వైర‌స్ విశ్వ‌రూపం….ఒక‌రి నుంచి ముగ్గురికి….

హైదరాబాద్‌, : రాష్ట్రంలో కరోనా ఉధృతి కొన సాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివ్‌ కేసులు వేలల్లో నమో దవుతుండగా… పాజిటివిటీ రేటు 10శాతానికి పైగా నమోద వుతోంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 77.435 మందికి కరోనా టెస్టులు చేయగా అందులో 6361 కేసులు నమో దవడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 9.68శాతంగా నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇది ఇలా ఉంటే మొదటి దశలో కంటే రెండో దశలో కరోనా వైరస్‌ రెండు న్నరరెట్ల అధిక వేగం, ప్రభావంతో వ్యాప్తిచెందు తోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గు రికి వైరస్‌ వ్యాపిస్తోందని టాటా ఇనిస్ట్యూట్‌ఆఫ్‌ ఫండ మెం టల్‌ రీసెర్చ్‌ , ఇండియన్‌ ఇని స్ట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో, తెలు గు రాష్ట్రాల్లో వ్యాపిసో ్తన్న కరోనా కొత్త వేరి య ంట్లు ప్రమా దకర మైనవని సర్వే వెల్లడించింది.
కాగా… రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ పేద కుటుంబాలను చిద్రం చేస్తోంది. కుటుంబాలకొ కుటుంబాలనే బలి తీసుకుంటోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 51మంది మృత్యువాత పడడం రాష్ట్రంలో కరోనా దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రభుత్వం, ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసు కుంటున్నా వైరస్‌ తో మరణాల సంఖ్య తగ్గకపోవడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మొదటి వేవ్‌లో కంటే సెకండ్‌వేవ్‌లో వైరస్‌ రెండున్నరరెట్ల అధిక శక్తితో వ్యాప్తి చెందుతోందని, ఒకరి నుంచి ముగ్గురికి వైరస్‌ వ్యాపిస్తోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కరోనా సెకండ్‌వేవ్‌ రాష్ట్రంలో ప్రమాదఘంటికలు మోగి స్తున్నా… డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటోం ది. మంగళవారం నమోదైన పాజిటివ్‌ కేసుల కంటే డిశ్చార్జి కేసులే అధికంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తీవ్ర, అతి తీవ్ర కరోనా లక్షణాలున్న వారిని మాత్ర మే ఆసుపత్రుల్లో చేర్చు కోవాలని ప్రయివేటు ఆసుపత్రులను రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డా. జీ. శ్రీనివాసరావు ఆదేశిం చారు. ఇక ఇప్పటి వరకు మనుషులకే పరిమితమైన కరోనా వైరస్‌… జంతువులకు సోకుతోంది. తాజాగా హైదరాబాద్‌ జూ పార్కులోని 8 సింహాలు కరోనా బారిన పడ్డాయి. కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతంగా వ్యాపిస్తున్న సమయంలోనూ వైద్య, ఆరోగ్యశాఖ కరోనా టెస్టుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా టీకా పొందేందుకు జనం పడుతున్న ఇబ్బం దులు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే అది 45ఏళ్ల పైబడిన వారికే టీ కా ఇస్తామనడంతో నిరక్ష్యారాస్యులు, వృద్ధులు, స్మార్ట్‌ ఫోన్‌ లేనివారు బుకింగ్‌ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు.
పాజిటివ్‌ కేసుల కంటే… డిశ్చార్జిలే ఎక్కువ…
తెలంగాణలో కరోనా సెకండ్‌వేవ్‌ ప్రమాదకరస్థితిలో వ్యాపిస్తున్నా కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య మెరుగైన స్థితిలో ఉంటోంది. రాష్ట్రంలో ఓ వైపు కరోనా రోజు వారీ కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. అదే సమ యంలో కరోనా రోగుల డిశ్చార్జి కూడా వేలల్లో ఉంటోంది. మంగళవారం కరోనా కేసులు 6361 నమోదైతే… డిశ్చార్జి అయిన వారి సంఖ్య 8126 గా నమోదైంది. రోజువారీ పాజిటివ్‌ కేసుల కంటే డిశ్చార్జి అయిన వారి సంఖ్యే మంగళ వారం ఎక్కువగా ఉండడం… వైరస్‌ కట్టడి దిశగా తెలంగాణ ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశమని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్న తాధి కారులు చెబుతున్నారు. ప్రస్తు తం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 82.30 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు 81.7కంటే ఎక్కువ. ప్రతీ రోజూ వేల సంఖ్యలో కరోనా రోగులు వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అవుతున్నారు. రోజు వారీగా వేలల్లో కరోనా రోగులు డిశ్చార్జి అవడం శుభ సూచకమని, త్వర లో నే వైరస్‌ సెకండ్‌వేవ్‌ను ని యం త్రిస్తామని అధికారులు చెబుతున్నారు.
తీవ్ర, అతి తీవ్ర లక్షణాలుంటేనే చేర్చుకోవాలి…
ప్రయివేటు ఆసుపత్రులకు డీహెచ్‌ ఆదేశాలు
తీవ్ర, అతి తీవ్ర లక్షణాలు ఉన్న వారిని మాత్రమే ఇన్‌పే షెంట్లుగా చేర్చుకోవాలని ప్రయివేటు ఆసుపత్రులను రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డా. జీ. శ్రీనివాసరావు ఆదేశించారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ 94శాతం కంటే ఎక్కువగా ఉంటే హో ం ఐసోలేషన్‌లో ఉంచాలని పేర్కొన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న కరోనా పేషెంట్ల ఫలితాల కోసం వేచి చూడా ల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య వివరాలను ఎప్పటికప్పుడు రోగులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనుమతి లేకున్నా కోవిడ్‌ చికిత్సలు నిర్వహించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయివేటు/కార్పోరేటు ఆసుపత్రులు రోగులను ఇబ్బందులకు గురిచేయకుండా మానవత్తవంతో చికిత్స అందించాలని స్పష్టం చేశారు.
పేద కుటుంబాలను చిద్రం చేస్తున్న కరోనా…
కరోనా మహమ్మారి అనేక కుటుంబాలను చిద్రం చేస్తోం ది. మరీ ముఖ్యంగా పేద కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది. కరోనా సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… పేద కుటుంబాల్లో వైరస్‌ అలజడి సృష్టిస్తూనే ఉంది. అనేక మంది పేదలు కరోనా బారిన పడి తనువుచాలిస్తున్నారు. జనెగామ జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కుటుం బాలకు కుటుంబాలే కరోనాకు బలవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఒకే ఇంట్లో ముగ్గురు కరోనాతో మృతిచెందారు. జనగామకు చెందిన గోనె సుశీల ఏప్రిల్‌ 27న కరోనాతో మృతి చెందింది. ఒక రోజు క్రితం ఆమె పెద్ద కొడుకు గోనె కృష్ణ మృతి చెందగా… ఆయన చనిపోయిన గంటల వ్యవథిలోనే సోద రుడు శ్రీనివాస్‌ ప్రాణాలు కోల్పోయాడు. హన్మకొండకు చెందిన కాశిబుగ్గ జర్నలిస్టు నాగరాజు కరోనాతో మృతి చెందారు. ఆయన కుటుంబం స్టేషన్‌రోడ్డులోని ఓ లాడ్జ్‌ లో దయనీయస్థితిలో జీవనం గడుపుతోంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. వరంగల్‌ జిల్లా నెల్లికుదురు మం డల కేంద్రంలో ఒకే కుటుంబంలో గంటల వ్యవథిలో తండ్రి కొడుకులు ఇద్దరూ కరోనాతో మృతిచెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement