హైదరాబాద్ : తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సుమారు మూడున్నర కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను తానే పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు..ప్రస్తుతం ఫామ్ హౌజ్ లో ఉన్న కెసిఆర్ వ్యాక్సిన్ ప్రక్రియపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫ్ రెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.. అనంతరం ఆయన వ్యాక్సిన్ ప్రక్రియపై ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు అని తేల్చిచెప్పారు. కొవిడ్ నుంచి ప్రతి ఒక్కరిని రక్షిస్తామని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించామని సీఎం తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం దాదాపు రూ. 2,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
స్వంతంగా రాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ (టీకా) ఇవ్వడం జరిగిందని, మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా మొత్తం అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు రూ. 2,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందనీ అన్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలను ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వైద్యశాఖ అధికారులకూ ఇచ్చారు తదనుగుణంగా మొత్తం రాష్ట్రంలో వున్న అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రెండు-మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తరువాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమం పటిష్టంగా, విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాలవారీగా ఇంచార్జులను నియమించడం కూడా జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు.
రూ.2500 కోట్ల ఖర్చుతో తెలంగాణాలో అందరికీ ఉచితంగా టీకా…కెసిఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement