హైదరాబాద్ – పల్స్‌పోలియో కార్యక్రమం తరహాలోనే కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్ వేసేవిధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా టెస్టుల కోసం, వ్యాక్సిన్ కోసం జనాలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఫలితంగా పాజిటివ్ రోగుల నుంచి సాధారణ ప్రజలకు వైరస్ వ్యాపి స్తోంది. మే 1 నుంచి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ అంటే… జనం పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిలానే మాస్కు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నా యని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా ప్రజల వద్దకే వ్యాక్సిన్ చేరవేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్, రెడ్డీస్ లాబ్ నుంచి స్పుత్నిక్-ఐ వ్యాక్సిన్లను పెద్ద సంఖ్యలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 18ఏళ్లు పైబడిన వారు అంతా కలిపి దాదాపు 2 కోట్ల మంది ఉంటారని, వారికి రెండు డోస్‌ల టీకాను ఇచ్చేందుకు 4 కోట్ల డోస్‌లు సమకూర్చు కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేయాలంటే రాష్ట్ర ప్ర భుత్వంపై రూ.2500 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తు న్నారు. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నర్సులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలతోనే గ్రామస్థాయి వరకు కరోనా వ్యాక్సినేషన్ కూడా నిర్వహించనున్నారు. కాలనీలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు జనం ఎక్కడుంటే అక్కడకు వెళ్లి టీకా ఇస్తారు.
తెలంగాణలో పల్స్‌పోలియో తరహాలోనే వ్యాక్సినేషన్
By sree nivas
- Tags
- corona
- drive
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- online news
- online news today
- online telugu news
- Telanagana News
- telangana
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
- VACCINE
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement