హైదరాబాద్ – తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కరోనా బారినపడ్డారు. కరోనా టెస్టులో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, సతీష్ మొన్న మండలి సమావేశానికి హాజరయ్యారు. అసంబ్లీ సెషన్స్‌లో భాగంగా శనివారం మండలిలో సతీష్ మాట్లాడారు. సతీష్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సభ్యుల్లో భయాందోళన నెలకొంది. ఆయనతో కాంటాక్ట్ లో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు.. సభ్యులందరూ కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా అసెంబ్లీ సమావేశాలను కుదించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement