Friday, November 22, 2024

గాలి ద్వారా క‌రోనా స్వైర విహారం – ప్ర‌జ‌ల‌ను హెచ్చరించిన హెల్త్ డైరెక్ట‌ర్

హైద‌రాబాద్ : క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి అంచ‌నా వేసిదానికంటే ఎక్కువుగా ఉంద‌ని, గాలి ద్వారా అతి వేగంగా ఒక‌రి నుంచి ఒక‌రికి వ్యాపిస్తున్న‌ద‌ని ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు హెచ్చ‌రించారు….కోఠిలోని ప్ర‌జారోగ్య కార్యాల‌యంలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ,క‌రోనా తొలి ద‌శ నుంచి ప్ర‌జ‌లు పాఠాలు నేర్చుకోలేద‌ని,. క‌రోనా వెళ్లిపోయింద‌నే భ్ర‌మ‌లో జ‌నం ఉన్నార‌న్నారు… మొద‌టి వేవ్‌ను ఎంతో కొంత అడ్డుకోగ‌లిగామ‌ని, ఆ త‌ర్వ‌త ప్ర‌జ‌ల్లో అల‌స‌త్వం వ‌చ్చింద‌ని వాపోయారు. ప్ర‌స్తుతం గాలి నుంచి వ్యాపించే ద‌శ‌కు క‌రోనా చేరుకుంద‌ని పేర్కొన్నారు. కొత్త మ్యుటేష‌న్ల కార‌ణంగా క‌రోనా వేగంగా వ్యాపిస్తోంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ విధిగా మాస్కు ధ‌రించాల‌ని సూచించారు. కాగా, రాష్ర్టంలో కొవిడ్ చికిత్స‌కు ప‌డ‌క‌లు, మందులు, ఆక్సిజ‌న్ కొర‌త లేద‌ని, రాష్ట్రంలోని 116 ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. . క‌రోనా రెండో ద‌శ వ్యాప్తి ఉధృతంగా ఉంద‌ని,. ప్ర‌పంచంలోని అగ్ర రాజ్యాలు కూడా క‌రోనా ముందు మోక‌రిల్లుతున్నాయ‌ని అన్నారు. . రాష్ర్టంలో ఎక్క‌డా బెడ్ల కొర‌త లేద‌ని, కేవ‌లం 15-20 కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లోనే ప‌డ‌క‌ల కొర‌త ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 5 కొవిడ్ ప్ర‌త్యేక ఆస్ప‌త్రులు నిర్వ‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కొవిడ్ టెస్టుల సంఖ్య‌ను పెంచుతామ‌ని ప్ర‌క‌టించారు. 80 శాతం మంది క‌రోనా బాధితుల్లో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవు అని వెల్లడించారు. క‌రోనా పాజిటివ్ రాగానే ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇది ఇలా ఉంటే రోజుకు ల‌క్ష‌కు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. కేవ‌లం 15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అయ్యింద‌న్నారు. నిన్న ఒక్క‌రోజే ల‌క్షా 26 వేల క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. 4,446 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి చెందిన తొలినాళ్ల‌లో 18 వేల బెడ్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య‌ను 38 వేల‌కు పెంచామ‌న్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో బెడ్ల సంఖ్య‌ను 53 వేల‌కు పెంచుతామ‌ని తెలిపారు. కొవిడ్ టెస్టుల సంఖ్య‌ను కూడా పెంచుతామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement