హైదరాబాద్ – తెలంగాణ సచివాలయంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి… ఇప్పటికే ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కరోనా గురై తిరిగి కోలుకుని విధులకు హాజరవుతున్నారు… ఈ నేపత్యంలో బిఆర్ కె భవన్ లోని వివిధ శాఖల ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు… 60 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.. దీంతో అన్ని శాఖల సిబ్బంది బయపడిపోతున్నారు…కరోనా ఉదృతి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. 50 శాతం సిబ్బంది హాజరుకు అనుమతించాలని సిఎస్ ను కోరారు…అలాగే అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలనే డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచారు.. సచివాలయంలో కేసులు పెరుగుతుండటంతో నేడు అధిక సంఖ్యలో ఉద్యోగులు సెలవులు పెట్టారు.. దీంతో సచివాలయం కళ తప్పింది
Advertisement
తాజా వార్తలు
Advertisement