Friday, November 22, 2024

తెలంగాణాలో మ‌ళ్లీ క‌రోనా హాట్ స్పాట్ లు…

గ్రేటర్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
అదుపుకాకపోతే కంటైన్మెంట్‌ జోన్లు
రేపటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా
రిజిస్ట్రేషన్‌ లేకపోయినా కోవిడ్‌ సెంటర్లలో వ్యాక్సిన్‌
ఆస్పత్రుల్లో బెడ్లకు డిమాండ్‌
మాస్క్‌ ధారణపై వారంపాటు పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌
వ్యాక్సినేషన్‌లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్‌ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జీహెచ్‌ఎంసీ లోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. గ్రామీణ జిల్లాల్లో పదుల సంఖ్య లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుంటే జీహెచ్‌ ఎంసీలోని పలు ప్రాంతాల్లో రోజువారీగా పాజిటివ్‌ కేసులు ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కరోనా కట్టడి చర్యలను ప్రారంభించింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న పలు ప్రాంతాలను గుర్తించి కరోనా హాట్‌స్పాట్‌లుగా ప్రకటించింది. హైదరా బాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ వికారాబాద్‌ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతండడంతో పలు ప్రాంతాలను అధికారులు కరోనా హాట్‌స్పాట్లుగా ప్రకటించారు. గ్రేటర్‌ పరిధిలోని హిమాయత్‌నగర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, చింతల్‌బస్తీ, గోల్కొండ, ఎల్‌బీనగర్‌, చార్మినార్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, చాంద్రా యణగుట్ట, సంతోష్‌నగర్‌ ప్రాంతాల్లో కరోనా కేసులు స్పీడ్‌గా పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా ప్రకటించారు.
హాట్‌స్పాట్లలో ట్రిబుల్‌ టీ వ్యూహం..
కరోనా పాజిటివ్‌ కేసులు పెద్ద సంఖ్యలో పెరుగు తుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా హాట్‌స్పాట్‌గా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ వ్యూహాన్ని అమలు చేస్తోంది. అయితే అధికారికంగా వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హాట్‌స్పాట్‌ ప్రాంతాలను గుర్తించకపోయినప్పటికీ… డీఎంఅండ్‌హెచ్‌వోలకు అధికారాలు ఇచ్చింది. ఆయా ప్రాం తాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోసారి కంటైన్మెంట్‌ జోన్లు…
కరోనా హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో పరిస్థితి ఇలానే కొనసా గితే వాటిని కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి, ఆయా ప్రాంతాల ప్రజలను ఇళ్లకే పరిమితం చేసే ఆలోచనల్లో వైద్య, ఆరోగ్యశాఖ ఉంది. పది రోజులుగా ఒకే ప్రాంతం నుంచి అధికంగా పాజిటి వ్‌ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌ ప్రాంతా లుగా గుర్తించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
రేపటి నుంచి 45ఏళ్లు నిండిన వారికీ టీకా…
తెలంగాణలో ఏప్రిల్‌ 1 నుంచి 45ఏళ్ల పైబడిన వారందరి కీ కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఇందుకు ప్రభుత్వ ఆసుపత్రు లతోపాటు ప్రయివేటు ఆసుపత్రుల్లో టీకా పంపిణీకి విస్తృతం గా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లను వైద్య, ఆరో గ్యశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో… కోవిడ్‌ టీకా తీసుకోవడంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవ ద్దని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జీ. శ్రీనివాసరావు తెలి పారు. ఏప్రిల్‌ 1 నుంచి 45ఏళ్లు పైబడినవారందరికీ టీకా పం పిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మొదటి డోస్‌ టీకా తీసు కున్న తర్వాత తప్పనిసరిగా రెండో డోస్‌ టీకా తీసుకోవా లన్నారు. రాష్ట్రంలో 10లక్షలకు పైగా మొదటి డోస్‌ తీసుకున్నా రని, వారంతా ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి 45ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ వ్యా క్సిన్‌ తీసుకోవా లని పిలుపునిచ్చారు. కరో నా సోకినా లేకు న్నా, దీర్ఘకాలిక వ్యాధులు లేకున్నా ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవా లన్నారు. దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ 1 నుంచి ప్రతీ రోజూ సాయంత్రం 3 తర్వాత రిజిస్ట్రేషన్‌ చేసుకోకున్నా 45ఏళ్ల వయసు ఉన్నట్లు వయో ధృవీకరణ పత్రం చూపిస్తే టీకా వేస్తామన్నారు.
దేశంలోనే అగ్రస్థానంలో
కరోనా వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో మరీ ముఖ్యంగా ప్రయి వేటు ఆసుపత్రుల్లో కోవిడ్‌ టీకాలు ఇస్తుండడంతో రాష్ట్రాన్ని మొదటిస్థానం వరించింది. రాష్ట్రంలోని ప్రయివేటు ఆసుప త్రుల్లో 48.11శాతం వ్యాక్సినేషన్‌ నమోదుతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ప్రయివేటు ఆసుపత్రుల్లో 43.11 శా తం వ్యాక్సినేషన్‌తో రెండోస్థానంలో ఢిల్లి నిలిచింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి టీకా పంపి ణీకి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆసు పత్రులతోపాటు ప్రయివేటు ఆసుప త్రుల్లోనూ కరోనా టీకాను అందు బాటులోకి తెచ్చింది. కోవాక్సి న్‌తోపాటు కోవీషీల్డ్‌ టీకాను అందుబాటులో ఉంచింది. 60 ఏళ్లకు పైబడిన వారు ప్రయి వేటు ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున కరోనా టీకా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 11, 85, 000 మందికి కోవిడ్‌ టీకా తీసు కోగా… అందులో 3,31,000 మంది ప్రయివేటు ఆసుపత్రుల్లోనే తీసుకున్నారు. వీరిలో ఎక్కువగా 60ఏళ్లకు పైబడిన వారే ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
ఆసుపత్రుల్లో కోవిడ్‌ బెడ్లు ఫుల్‌…
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా యాక్టివ్‌ కేసులు పెరుగుతుం డడంతో గాంధీ, కింగ్‌కోఠి, టిమ్స్‌ ఆసుపత్రులతో పాటు జిల్లా ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి, నిమ్స్‌, కింగ్‌ కోఠి, గాంధీ ఆసుపత్రుల్లో కరోనా బెడ్లను మళ్లి పెంచా రు. గాంధీలో 200 పడకలతో కోవిడ్‌ వార్డును ఏర్పాటు చేయగా అందులో 100 మందికి పైగా పేషెంట్లు చికిత్స పొం దుతు న్నారు. కరోనా మొదటివేవ్‌ తగ్గుముఖం పట్టడంతో గతేడాది డిసెంబరు నాటికి పలు కార్పోరేటు, ప్రయివేటు ఆసుపత్రులు కరోనా బెడ్లను తగ్గించాయి. అయితే 20 రోజులుగా కరోనా సెకండ్‌ వేవ్‌ పెరగడంతో మళ్లిd కరోనా బెడ్లను పెంచుతున్నా యి. ఇక హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ప్రయివేటు కార్పోరేటు ఆసుపత్రుల్లో కరోనా వార్డులు రోగులతో నిండిపోయాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో వెయి టింగ్‌ లిస్టు కొనసాగుతోందంటే కోవిడ్‌ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి పస్తుతం నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఎక్కు వగా మైల్డ్‌, మాడరేట్‌ సింప్టమ్స్‌ ఉన్న వారే అధికంగా ఉన్నారు.
సంతృప్తికర ఆక్సిజన్‌ స్థాయిలు
కరోనా మొదటి వేవ్‌ సమయంలో చాలా మంది పేషెంట్లలో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోయాయి. గతేడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు రాష్ట్రంలో కరోనా వెెగంగా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది పేషెం ట్లు ఆక్సిజన్‌ లెవల్స్‌ 65శాతానికి పడిపోయిన దశలో చేరేవారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న మనిషిలో 96 నుంచి 98శాతం మధ్య ఆక్సిజన్‌ స్థాయిలు ఉండాలి. అయితే ప్రస్తు తం కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితుల్లో కరోనా పేషెంట్లలో ఆక్సిజన్‌ నిల్వలు అంతగా పడిపోవడం లేదని వైద్య నిపుణులు చెబతున్నారు. 93శాతం వరకు ఆక్సిజన్‌ స్థాయిలు ఉంటున్నాయి.
ఈ పరిణామం వైరస్‌ సోకినా తీవ్రత తక్కువగా ఉంటుం దనడానికి సంకేతమని వైద్యులు చెబుతున్నారు. గతంలో వైర స్‌ సోకిన పేషెంట్లలో ఆక్సిజన్‌ నిల్వలు 65శాతానికి పడిపోవ డంతో వారి ఊపిరితిత్తులు తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యేవి. ఇప్పుడు చేరుతున్న పేషెంట్లలో చాలా మంది ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌ తక్కువగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు.
ఊరిబయటే కరోనా సోకిన విద్యార్థిని…
కరోనా సోకడంతో ఓ విద్యార్థినిని ఊరి ప్రజలు గ్రామం లోకి రానివ్వ లేదు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇండ్రవెల్లి మండ లం సాలెగూడలో కరోనా సోకిన విద్యార్థిని సోన్‌దేవిని ఊరి ప్రజలు పొలంలోనే ఉంచారు. ఈ ఘనటపై స్పందించిన అధికారులు ఆ గ్రామానికి వెళ్లి గ్రామస్థులతో మాట్లాడారు. ఆ విద్యార్థినికి కరోనా టెస్టు చేశారు. నెగెటివ్‌ రావడంతో ఊళ్లోకి వెళ్లొచ్చని అధికారులు తెలిపారు. అయితే తన గ్రామస్థుల్లో కరోనా భయం ఉన్నందున మరో మూడు రోజులపాటు పొలం వద్దనే ఉంటానని యువతి తేల్చిచెప్పినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement