హైదరాబాద్: తెలంగాణాలో వ్యాపార కేంద్రమైన బేగంబజార్‌లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. కేవలం 24 గంటల వ్యవధిలో 100 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి…దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.. ఇక్కడ పని చేస్తున్న వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.. అలాగే యాజమానులు, వారి కుటుంబ సభ్యలు తప్పని సరిగి కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరింది.. మార్కెట్ నిత్యం రద్దీగా ఉండటం, కోవిడ్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.. దీంతో అదికారులు బేగం బజార్ అసోసియేషన్ ప్రతినిథులతో చర్చలు జరిపింది.. పరిస్థితిని అదుపు చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై వారితో చర్చించారు.. ఈనేపథ్యంలో మార్కెట్‌లోని దుకాణాల వేళల్లో మార్పులు చేస్తూ ది హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నది. రేపటి నుంచి ఉదయం 9 గంటలకు దుకాణాలు తెరుస్తామని, సాయంత్రం 5 గంటలకు షాపులను మూసివేస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. బేగంబజార్, ఛత్రి, ఫిష్ మార్కెట్, మిట్టికా షేర్ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్ కిరాణ దుకాణాలన్నీ తమ అసోసియేషన్ నిబంధనలను పాటిస్తాయని చెప్పారు. వ్యాపారులు, వినియోగదారులు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలని కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement