Saturday, November 23, 2024

తెలంగాణాలో క‌రోనా ప్ర‌ళ‌యం – 72 గంట‌ల్లో 26 వేల పాజిటివ్స్ – 166 డెత్స్

మూడు రోజుల్లోనే 166 మంది మృతి
24 గంటల్లో 58 మంది బలి
కొత్తగా మరో 7994 మందికి కరోనా
టిమ్స్‌ ఆస్పత్రిలో రోగుల ఆకలికేకలు
పెయిన్‌ కిల్లర్స్‌తో కరోనా తీవ్రం : ఐసీఎంఆర్‌ హెచ్చరిక
పక్షం రోజులుగా కరోనా కిట్ల కొరత
తగ్గుతున్న రోజువారీ కరోనా టెస్టులు
పల్స్‌ పోలియో తరహాలో వ్యాక్సినేషన్‌
రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్‌, : తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. ప్రాణాలు వదులుతున్న కోవిడ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఓ వైపు కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య గతంలో ఎప్పుడూ లేనివిధంగా పెరుగుతుంటే… కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బుధ‌వారం నాడు 7994 మందికి వైరస్‌ సోకింది. 58 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకి ఆస్పత్రికి వెళ్లిన వారు తిరిగి ప్రాణాలతో వస్తారా..? లేరో… ? అన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. ఒక్క వరంగల్‌ ఎంజీఎంలోనే గడిచిన 48 గంటల్లో 41మందిని కరోనా బలి తీసుకుందంటే రాష్ట్రంలో కరోనా మరణాలు ఏ స్థాయిలో నమోదవుతున్నాయో ఇట్టే తెలిసిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 72 గంట‌ల్లో కరోనా మహ మ్మారి 166 మందిని బలితీసుకుంది. బుధ‌వారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 58 మంది కరోనాకు బలయ్యారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 52మందిని. మంగ‌ళ‌వారం 56 మందిని కరోనా పొట్టన పెట్టుకుంది
కొత్తగా 7994 మందికి కరోనా
రాష్ట్రవ్యాప్తంగా సోమవారంనాడు 10వేలకు పైగా నమో దైన రోజువారీ పాజిటివ్‌ కేసులు , మంగళవారం 8061 , బుధ‌వారం 7994నమోదైనట్లు గురువారం ఉద‌యం రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజా కేసులు కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,27,960కు చేరు కుంది. కరోనా నుంచి కోలుకోవడంతో మంగళవారం 4009 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,49,692 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 76, 060 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. వారిలో అధిక‌శాతం మంది ఇళ్ల‌లోనే ఉండి చికిత్స పొందుతున్నారు..ఇక బుధ‌వారం నాడు 1,09,324 మంది క‌రోనా కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ ఉధృతంగా వ్యాపిస్తోంది. ఈ దశలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులతో పాజిటివ్‌లను తొలి డోస్ వ్యాక్సినేష‌న్ వేయించుకోగా, 28.828 మందికి రెండో డోస్ టీకా వేశారు.. దీంతో ఇప్పటి వ‌ర‌కు తొలి డోస్ టీకా వేయించుకున్న వారి సంఖ్య 39,57,915 కి చేరింది.. అలాగే రెండో డోస్ ను ఇప్ప‌టి వ‌ర‌కు 5,78, 726 మంది వేయించుకున్నారు.. ఇక క‌రోనా విజృంభిస్తున్న‌త‌రుణంలో క్వారంటైన్‌ చేసి వైరస్‌ వ్యాప్తిని అరికట్టాల్సి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరోనా టెస్టులకు టెస్టింగ్‌ కిట్ల కొరత వేధిస్తోంది. యాంటిజెన్‌ కిట్లు సరిపడా లేకపోవడంతోపాటు సిబ్బంది కూడా తగినంత సమయం టెస్టులు చేయని పరిస్థితులు నెలకొన్నాయి. టెస్టింగ్‌ కిట్ల కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. 10 రోజులకు పైగా రాష్ట్రంలో కరోనా టెస్టింగ్‌ కిట్లకు కొరత కొనసాగుతోంది. సరిపోయేన్ని కిట్లకు ఆర్డర్‌ ఇచ్చామని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతున్నా క్షేత్రస్థాయిలోకి అవి అందుబాటులోకి రావడం లేదు. దీంతో కరోనా టెస్టుల కోసం పరీక్షా కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. తెల్లవారు జాము నుంచి బారులు తీరుతున్నారు. ఒక్కో టెస్టింగ్‌ కేంద్రంలో 50 మందికి మాత్రమే పరీక్షలు చేస్తుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల ఒకే పీహెచ్‌సీలో టెస్టులు చేయడంతోపాటు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తుండడంతో గందరగోళం నెలకొంది. కరోనా యాంటిజెన్‌ కిట్లకు కొరత ఉండడంతో టెస్టులను తగ్గించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.
వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్టులు స్వల్పమే
కొవిడ్‌ వ్యాక్సిన్‌ల వల్ల కలిగే దుష్ప్రభావాలు (సైడ్‌ ఎఫెక్టులు) స్వల్పమేనని బ్రిటన్‌ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్‌ తీసుకున్న నలుగురిలో ఒకరికి మాత్రమే సైడ్‌ ఎఫెక్టులు కనిపిస్తున్నాయని, అవికూడా ఒకటి లేదా రెండు రోజుల్లోనే తగ్గిపోతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. వ్యాక్సిన్‌ తీసుకున్న నలుగురిలో ఒకరిలో మాత్రమే జ్వరం, తలనొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. టీకా తీసుకున్న 24 గంటల్లో ఈ లక్షణాలు కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిగా నయం అవుతున్నట్లు పరిశోధ కులు గుర్తించారు. సైడ్‌ ఎఫెక్టులు ఉన్నా 80శాతం సాధారణ ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నట్లు బ్రిటన్‌ పరిశోధకులు వెల్లడించారు.
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల
రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు క్వార్టర్లకు నిధులు విడుదల చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌కు రూ.796.96 కోట్లు, ప్రజారోగ్య శాఖ సంచాలకులకు రూ.168.98 కోట్లు నిధులు మంజూరు చేశారు. వైద్య విద్య డీఎంఈకి రూ.813.27 కోట్లు, వైద్య విధాన పరిషత్‌కు రూ.297.41 కోట్లు, నిమ్స్‌ ఆస్పత్రికి రూ.109.75 కోట్లు మంజూరు చేశారు. యోగా అధ్యయన పరిషత్‌కు రూ.16.36 కోట్లు, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రికి రూ.40.46 కోట్లు, ఆయుర్వేద, యోగ విభాగాలకు రూ.11.80 కోట్లు కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement