హైదరాబాద్ – ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్‌రాజ్, యాదాద్రి- భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారు హోం క్వారం టైన్లో ఉన్నారు. తనకు కరోనా సోకిందని భద్రాద్రి -కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ.రెడ్డి తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. మంచిర్యాల ఆర్టీసీ డిపోలో 12మంది కార్మికులు కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 20 మంది హౌస్‌సర్జన్ వైద్యులకు కరోనా సోకింది. ఇందులో నలుగురు ఎంజీ ఎంలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
గాంధీలో ప్రతి 10 నిమిషాలకు ఓ కొత్త కేసు..
ప్రతి 10 నిమిషాలకు ఒకరు హైదరాబాద్ గాంధీ హాస్పటల లో కోవిడ్‌తో చేరుతున్నారు. గాంధీకి వచ్చిన కరోనా పేషెంట్లు చికిత్స పొందుతూ ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నారు. రోజూ 15 నుంచి 25 మధ్యలో కరోనా పేషెంట్లు మృతి చెందుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో శనివారం నుంచి గాంధీ ఆస్ప త్రిని పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. శుక్రవారం కరోనా బాధితులతో ఐపీ బ్లాక్ అంతా నిండిపోయింది. దీంతో వెంటనే గాంధీ ఆస్పత్రిని రేపటి నుంచి కోవిడ్ ఆస్పత్రిగా మారుస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా రోగులు పెరుగుతుండడంతో నాన్ కోవిడ్ విభాగాలను కరోనా చికిత్సల కోసం వైద్యులు ఖాళీ చేయిస్తున్నారు. శనివారం నుంచి గాంధీలో ఓపీని నిలిపివేయాలని, ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సేవలు కూడా నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో 450 మందికి పైగా కరోనా పేషెంట్స్ ఉన్నారు. గురువారం ఒక్కరోజే 150 మందికి పైగా కోవిడ్ పేషెంట్లు జాయిన్ అయ్యారు. కరోనా మొదటి వేవ్ సమయంలోనూ గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో కరోనా చికిత్సలకే ప్రభుత్వం కేటాయిం చింది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండడంతో మరోసారి గాంధీని కోవిడ్ నోడల్ ఆస్పత్రిగా ప్రకటించింది.