జగిత్యాల వసతిగృహంలో 22 మంది విద్యార్థులు, ఐదుగురు టీచర్లకు పాజిటివ్
సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కస్తూరిబా పాఠశాలలో మరో15 మందికి కరోనా
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి ఆదర్శ పాఠశాలలో 12 మందికి కోవిడ్ పాజిటివ్
నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో ఇద్దరికి కరోనా
ఉస్మానియా వర్శిటీ లేడీస్ హాస్టల్‌లో ఇద్దరు పీజీ విద్యార్థినిలకు పాజిటివ్
హైదరాబాద్, : రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తుండడంతో విద్యాసంస్థల మూసివేతకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. పరిస్థితి చేజారక ముందే ముందస్తు చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి పాఠశాల, సాంకే తిక ఉన్నత విద్యాశాఖలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసేందుకు సంబంధించి ప్రభుత్వం శనివారం ఉన్నతాధికారులతో సమావేశమై తుదినిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని పాఠశాలల్లో రెండు రోజుల వ్యవధిలోనే 150 మంది విద్యా ర్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవు తుండడం, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని , ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో విద్యాసంస్థలను కొనసాగించాలా, లేదా అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆరవ తరగతి నుంచి పూరి స్థాయి లో తరగతులు నిర్వహిస్తుండడం, విద్యార్థుల్లో ఎవరి కో ఒకరికి కరోనా రావడం అది గుర్తించని తల్లిదం డ్రులు తరగతులకు పంపడంతో ఈ వైరస్ విజృం భిస్తోందని అధికారులు చెబుతున్నారు. గురు, శుక్రవా రాల్లో 150 మందికిపైగా విద్యార్థులు వైరస్ బారిన పడగా శుక్రవారం ఒక్కరోజే వంద మందికిపైగా విద్యా ర్థులు పాజిటివ్‌గా నిర్ధారించారు. మంచిర్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు రోజుల్లో 29 మంది విద్యార్థులకు కరోనా సోకింది. నిర్మల్ జిల్లా భైంసాలోని జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో 176 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 25 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఉమ్మడి ఆదిలా బా ద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిం చిన పరీక్షల్లో 35 మంది విద్యార్థులతో పాటు మరో 21 మం ది ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జగిత్యాలలోని బాలికల గురుకుల పాఠశాలలో 200 మంది విద్యార్థులు చదువుతుండగా 17 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. 20 మంది బాలికలకు జ్వరం రాగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కస్తూర్బా పాఠశాలలోనూ 60 మంది విద్యార్థులకు పరీక్షలు జరపగా 15 మందికి కరోనా సోకినట్లు తేలింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి పాఠశాలలో 12 మందికి మహమ్మారి సోకినట్లు అధి కారులు చెప్పారు. రాజేంద్రనగర్ ఎస్టీ బాలుర వసతి గృహంలో 92 మంది పిల్లలకు కోవిడ్ పరీక్షలు జరపగా 22 మందికి వైరస్ సోకింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ బాలుర గురుకుల పాఠశాలలో వంట మనిషితో సహా ఐదుగురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాల వాడ బీసీ గురుకుల పాఠశాలలో 18 మందికి కరోనా పరీక్షలు జరపగా నలుగురికి కరోనా సోకింది. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా వసతి గృహంలో ఇద్దరు పీజీ విద్యార్థిణులకు కరోనా సోకింది. ఈ వసతి గృహంలో మొత్తం 400 మంది ఉన్నారు. శనివారం నుంచి మూడో సెమిస్టర్ పరీక్షలు ఉన్నందున వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాకే పరీక్షలకు అనుమతించాలని అధికా రులు నిర్ణయించారు. కరోనా సోకితే పరీక్షలు ఎలా జరు పుతాని విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. అధికారులు మాత్రం పరీక్షలను వాయిదా వేసేది లేదని తెగేసి చెప్పారు. కరోనా సోకిన వారికి మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని ఉస్మానియా వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు. ఈ విద్యార్థులను రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణి స్తామని సప్లిమెంటరీగా భావించమని చెప్పారు.
పాఠశాలలు, విద్యాసంస్థలు, వర్సిటీలలో కరోనా కేసులు నమోదవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే విద్యార్థుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని వైరస్ సోకిన వారిని ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తు న్నామని అధికారులు చెబుతున్నారు. కాగా ఉస్మాని యా విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరగనున్న పరీక్షలు యధాతథంగా ఉంటాయని రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి చెప్పారు. కరోనా కారణంగా పరీక్షలకు హాజరు కాలేని వారికి మళ్లి పరీక్షలు నిర్వహిస్తామని ఆయన స్పష్టంచేశారు.
పాలమూరును వణికిస్తున్న కరోనా
కరోనా పాలమూరు జిల్లాను అతలాకుతలం చేస్తోంది. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. వారం రోజులుగా గ్రామాలు, పాఠశాలలను తనిఖీ చేసి కరోనా లక్షణా లున్న వారిని గుర్తించి పరీక్షలు జరిపి చికిత్స అందిస్తు న్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన 14 బృం దాలు వారం రోజుల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి కరోనా లక్షణాలున్న వారిని గుర్తించింది.జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.