Friday, November 22, 2024

కరోనా బారినపడితే కుటుంబం విచ్ఛిన్నమే..

కవాడిగూడ : ప్రాణాంతక మహామ్మారి కరోనా వైరస్‌ భారీన పడితే కుటుంబమంతా విచ్చిన్నమేనని ముషీరాబాద్‌ నియోజకవర్గం శాసనసభ్యులు ముఠా గోపాల్‌ అన్నారు. కరోనా వల్ల ఆనేక కుటుంబాలు ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ముషీరాబాద్‌లో ఓ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా, వరదబాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితిలో కరోనా వైరస్‌ భారిన పడితే మనపై ఆదారపడిన కుటుంబ సభ్యులు ఆగమైతరని ఆయన వివరించారు. ఇప్పటికే ఒకపక్క కరోనా, మరోపక్క వరదలు పేదలకు మరింత పేదరికంలో పడేశాన్నారు. ప్రతి ఒక్కరు ఇప్పటికైనా మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్‌ రుద్దుకోని కరోనాతో జాగ్రత్తగా ఉంటూ ఆత్మస్థయిర్యంతో, మనోదైర్యంతో జీవీద్దామని ఆయన సూచించారు. ఇప్పటి వరకు కరోనా దగ్గరకు రాలేదని అనుకోవద్దని, నీ చుట్టూ కరోనా వైరస్‌ ఉందని, ఏ క్షణంలోనైనా అంటుకోవచ్చాన్నారు. పోరపాటున బయటికి వెళితే తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, అత్యవసరమైతే తప్పా బయటికి రావద్దని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సలహాల ను స్వీకరించి అందుకు అనుగుణంగా రాబోయే రోజుల్లో జీవిత విధానం అలవర చుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెరాసా నేతలు ముఠా జయసింహా, ముచ్చకుర్తి ప్రభాకర్‌, వై శ్రీనివాస్‌, శంకర్‌గౌడ్‌, జావీద్‌, శ్రావణ్‌ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement