హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భాగ్యనగరంలో మధ్యాహ్నం దాకా భానుడి భగభగలు ఉండగా.. ఆ తర్వాత అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, బాలానగర్, బోరబండ, బేగంపేట, పంజాగుట్ట, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. గత కొద్దిరోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం వర్షం కారణంగా కాస్త ఉపశమనం పొందారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు జూన్ 7 నుంచి జూన్ 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందనీ, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తన అంచనాలో తెలిపింది.