Saturday, November 23, 2024

Phonepe: ఫోన్ పే గేట్ వే ద్వారా రూ.8 లక్షల వరకు ఆదా చేసుకునే సౌలభ్యం

హైద‌రాబాద్ : తమ పేమెంట్ గేట్ వే చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు రూ.8లక్షల వరకు ఆదా చేసుకునే వీలు కల్పిస్తోందని ఫోన్ పే ప్రకటించింది. చాలావరకు పేమెంట్ గేట్ వేలు 2శాతంను ప్రామాణిక లావాదేవీ ఫీజుగా వసూలు చేస్తుండగా ఫోన్ పే పేమెంట్ గేట్ వే మాత్రం కొత్త మర్చంట్లకు ఆన్ బోర్డింగ్ ను ఉచితంగా కల్పించే ఒక ప్రత్యేక ఆఫర్ కలిగి ఉంది.

ఈసందర్భంగా ఫోన్ పే పేమెంట్ గేట్ వే వాస్తవ సామర్థ్యం గురించి ఫ్లవర్ ఆరా అండ్ బేకింగో సంస్థ వ్యవస్థాపకులు సుమన్ పాత్రా మాట్లాడుతూ… ఒక ఇ-కామర్స్ సంస్థగా, నమ్మకమైన గేట్ వే భాగస్వామిని కలిగి ఉండడం చాలా ముఖ్యమన్నారు. అంతేకాక ఫోన్ పే వారసత్వం, అనుభవం వల్ల ఫోన్ పే పేమెంట్ గేట్ వే ను తమ అభివృద్ధి భాగస్వామిగా కలిగి ఉండడం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. జర్ కో ఫౌండర్ అండ్ సీఈఓ నిశ్చయ్ ఏజీ మాట్లాడుతూ…. జర్ లో తాము ప్రయాణం ప్రారంభించినప్పుడే, ఫోన్ పే కు జనంలో ఉన్న ఆదరణ, స్పందన ఆధారంగా ఫోన్ పేను తమ పేమెంట్ భాగస్వామిగా చేసుకున్నామన్నారు. వినియోగదారులు ఇప్పటికే యూపీఐకి సిద్ధంగా ఉండడంతో ఫోన్ పే భారీ నెట్ వర్క్ తమ పనిని చాలా సులభతరం చేసిందన్నారు. ఫోన్ పే లోని పేమెంట్ గేట్ వే బృందం తమతో మొదటి నుండి చక్కటి సహకారం అందిస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement