Tuesday, November 19, 2024

HYD: తలసేమియా రహిత తెలంగాణపై నిరంతర వైద్య విద్య … తలసేమియా నివారణ – ఒక అడుగు దూరంలో

హైదరాబాద్: హైదరాబాద్‌లో తలసేమియా రహిత తెలంగాణ, తలసేమియా నివారణ – ఒక అడుగు దూరంలో అనే అంశంపై దృష్టి సారించే నిరంతర వైద్య విద్య (సీఎంఈ) కార్యక్రమం కోసం ప్యానలిస్టులు, విశిష్ట అతిథులు, వైద్య నిపుణులు సమావేశమయ్యారు. టీఎస్ సీఎస్ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ తన ప్రారంభ ఉపన్యాసంలో, కార్యక్రమానికి హాజరైన అతిథులకు స్వాగతం పలకడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రఖ్యాత గైనకాలజిస్ట్‌లు అండ్ ప్రసూతి వైద్యుల హాజరు గురించి ఆయన వెల్లడించారు.

తెలంగాణను తలసేమియా రహితంగా మార్చడానికి చేస్తున్న సమిష్టి కృషిలో వారి కీలక పాత్రను వెల్లడించారు. డాక్టర్ అగర్వాల్ కార్యక్రమ ఇతివృత్తం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. తలసేమియా ముగింపు కేవలం ఒక అడుగు దూరంలో ఉందని వెల్లడించారు. వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న చైనీస్ సామెతను స్ఫూర్తిగా తీసుకుని, ఈ లక్ష్యం వైపు చేసే ప్రయాణంలో వేసే ప్రతి అడుగు ప్రాముఖ్యతను ఆయన ఎత్తిచూపారు. డాక్టర్ అగర్వాల్ ఈ జన్యుపరమైన రుగ్మతను ఎదుర్కోవడంలో నివారణ చర్యల సౌలభ్యత, సమర్థతను వివరిస్తూ.. తలసేమియా నివారణ కేవలం ఒక అడుగు దూరంలో ఉందనే మంత్రాన్ని పునరుద్ఘాటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement