హైదరాబాద్ : రాష్ట్రంలో కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. అదనపు లోడ్ పేరుతో గత మూడు నెలలుగా డెవలప్‌మెంట్ చార్జీల పేరిట విద్యుత్ శాఖ అదనంగా విద్యుత్ చార్జీలను వడ్డిస్తోం ది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇంట్లో విద్యుత్ ఉపకరణాలు వినియో గించే శక్తి మొత్తాన్ని ఎనర్జీలోడ్ అంటారు. వాడే ఉపకర ణాలు పెరిగితే లోడ్ పెరుగుతుంది. ఒక కిలోవాట్‌కు కనెక్షన్ తీసుకుని.. రెండు కిలోవాట్ల విద్యుత్‌ను వినియోగదారుడు వినియోగిస్తే.. అదనపు కిలోవా ట్‌కు డెవలప్‌మెంట్ చార్జీల పేరిట రూ. 2,836 వసూ లు చేస్తారు. ఏసీకి వెయ్యి నుంచి 3 వేల వాట్లు, కంప్యూ టర్ 100 -250 , వాటర్ హీటర్ 550-1500, మిక్సీ 150-750, ఫ్రిజ్ 60- 250, బల్బులు 5-60 , సీలింగ్ ఫ్యానుకు 50-150 వాట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది.
వాడే ఉప కరణాలు పెరిగితే లోడ్ పెరుగుతుంది. ఒక కిలోవాట్‌కు కనెక్షన్ తీసుకుని రెండు కిలోవాట్లు వినియోగిస్తే అదదనపు కిలోవాట్‌కు డెవలప్‌మెంట్ చార్జీల పేరిట రూ. 2,836 వసూలు చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 400 కలిపి మొత్తం రూ. 3,236 చెల్లించాల్సి ఉంటుంది . ఈ విషయంపై కొన్ని చోట్ల కిరా యిదారు లకు, ఇంటి యజమానులకు మధ్య వివాదా లు తలెత్తుతున్నాయి. అద్దెకున్న వారే చెల్లించాలని యజమానులు చెబుతుండగా.. బిల్లు వరకు తాము చెల్లిస్తామని డెవలప్‌మెంట్ చార్జీలతో తమకుక సంబంధం లేదని అద్దె దారులు వాదిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ అదనపు వడ్డన కిరాణషాపు నడుపించుకునే చిరు వ్యాపారులకు గుదిబండగానే మారుతోంది. నెలకు సగటున రూ. 400 నుంచి రూ. 500 వరకు చిరు వ్యాపారులు విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంటారు. కొందరి వ్యాపారులకు గతంలో వచ్చిన విద్యుత్ బిల్లుల కంటే అదనంగా డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో రూ. 2,832తో కలిపి మొత్తం రూ. 3,200 పై చిలకు చెల్లించాలని విద్యుత్ బిల్లు వచ్చింది. ఇంత బిల్లు ఎలా చెల్లించాలంటూ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
విద్యుత్ శాఖ ఏం చెబుతోంది..?
సాధారణంగా విద్యుత్ మీటర్ తీసుకునెటప్పు డు లోడ్‌ను బట్టి కనెక్షన్ ఇస్తారు. ఎవరైనా వినియోగ దారులు కనెక్షన్ తీసుకున్నప్పటికి కంటే ఎక్కువ విద్యు త్ వాడుతున్నట్లయితే మీటర్ రీడింగ్‌లో ఉండే రికార్డె డ్ మ్యాగ్జిమం డిమాండ్ ( ఆర్‌ఎండీ) ద్వారా ఈ విష యం బయపడుతోంది. దీన్ని బట్టి డెవలప్‌మెంట్ ఛా ర్జీలు వసూలు చేస్తారు. ‘ వినియోగదారు కనెక్షన్ పొం దే సమయంలో వాడుతున్న ఉపకరణాల సామా ర్థ్యా న్ని బట్టి లేదా వినియోగదారు కోరుకున్న లోడ్‌తో స్వీస్ మంజూరు చేస్తారు. దీన్నే ఒప్పంద లోడ్ అంటారు.
ఆపై ఉపకరణాల సంఖ్య పెరగడం వల్ల తగిన డవలప్‌మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి ఈ లోడ్‌ను పెంచుకోవాల్సి ఉంది. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో అదనపు లోడ్ వినియోగిస్తున్న కొందరు వినియోగదారులను గుర్తించాం. వారికి ఫిబ్ర వరి, మార్చి నెలల బిల్లుల్లో చార్జీలు విధించాం’ అని ఓ డిస్కం ఉన్నతాధికారి వివరించారు. ‘విద్యుత్ విని యోగం పెరిగినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడు పెరుగు తుంది. దాని స్థాయి పెంచకపోతే లోవోల్లేజీ సమస్య తలెత్తుతుంది. లోడ్ ఎంత ఉందో తెలిస్తేనే మౌళిక సదుపాయాలను మెరుగుపరచగలు గుతామం’ అని సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు.
వినియోగదారులకు విద్యుత్ షాక్…
Advertisement
తాజా వార్తలు
Advertisement