Tuesday, November 19, 2024

ప‌వ‌ర్ లోకి రావాలి …ఏం చేద్దాం చెప్పండి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు.. ఆ పార్టీ అధి ష్టానం మరింత దృష్టి సారించింది. పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే.. పూర్తి సమ యాన్ని ఇక్కడనే కేటాయిస్తు న్నారు. ఐదు రోజుల క్రితమే రాష్ట్రానికి వచ్చి సీఎల్పీ నేత భట్టి పాదయాత్రను ప్రారంభించిన ఠాక్రే.. తిరిగి ఈ నెల 23న రాష్ట్రానికి వస్తున్నారు. వరసగా ఐదు రోజులు ఇక్కడే ఉండి పార్టీ బలోపేతానికి తీసుకునే కార్య క్రమాలు, హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న యాత్రలపైన సమీక్ష చేయ నున్నారు. వీరితో పాటు టీ పీసీసీ అనుబంధ సంఘా లతోను సమావేశమై. పార్టీ బలోపేతానికి చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపైన చర్చించే అవకాశం ఉంది. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రేవంత్‌రెడ్డి ‘యాత్ర ఫర్‌ చేంజ్‌ ‘ పేరుతో గత ముప్పైనాలుగు రోజు లుగా యాత్ర చేస్తుండగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరు రోజులుగా పాద యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే పార్టీ కార్యక్ర మాలు, సమీక్షల దృష్ట్యా వీరి ద్దరు యా త్రలకు నాలు గైదు రోజుల వరకు బ్రేక్‌ ఇవ్వ నున్నారు. యాత్ర లకు ప్రజల నుంచి వస్తున్న స్పం దన.. జనం లోకి వెళ్లేందుకు తీసు కుంటున్న చర్యలు, భవిష్యత్‌ లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లా లనే అంశా లపై చర్చించే అకాశం ఉంది. పీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం మంగళవారం నుంచి ఐదు రోజుల వరకు యాత్రకు విరామం ఇవ్వ నున్నారు. సీఎల్పీ నేత భట్టి కూడా బుధవారం నుంచి పాద యాత్రకు బ్రేక్‌ ఇవ్వ నున్నారు. మూడు రోజుల తర్వాత తిరిగి తన పాదయాత్రను ప్రారంభించ నున్నారు.

ఠాక్రే షెడ్యూల్‌ ఇదే..
పార్టీ రాష్ట్ర వ్యవహారాల్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే ఈ నెల 23న ఉదయం హైదరాబాద్‌కు రాను న్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీ కార్యదర్శులతో గాంధీ భవన్‌లో సమావేశం కానున్నారు. 24న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు టీ పీసీసీ అనుబంధ విభాగమైన ఫిషర్‌మెన్‌ కమిటీతో, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరుక యూ త్‌ కాంగ్రెస్‌ నాయకులతోనూ సమావేశం అవుతారు. 25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్పోరేటర్స్‌, మాజీ కార్పోరేటర్స్‌, కార్పోరేషన్‌లో పోటీ చేసిన అభ్యర్థులతోనూ పార్టీ కార్యక్రమాలపై చర్చించ నున్నారు. అదే రోజు సాయం త్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు హాత్‌ సే హాతో జోడో అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా అండర్‌-19, ట్వంటీ-20 క్రికెట్‌ మ్యాచ్‌లో గెలు పొందిన విజేతలకు ఎల్బీస్టేడి యంలో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. 26న ఉదయం గాంధీభవన్‌లో పీసీసీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. అదే రోజు సాయంత్రం ఖమ్మం లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి చేపట్టే హాత్‌ సే హాత్‌ జోడో అభయాన్‌ కార్యక్రమానికి హాజరవుతారు. 27న ఉదయం హైదరాబాద్‌ నుంచి తిరిగి నాగ్‌పూర్‌ బయలుదేరి వెళ్లుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement