Saturday, November 23, 2024

కాంగ్రెస్‌ నేత మచ్చ సుధాకర్‌ సస్పెన్షన్

చౌదరిగూడెం : పార్టీ వ్యతిరేక కార్యకలపాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం జిల్లెడ్‌, చౌదరిగూడెం మండల కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ జడ్పిటిసి సుధాకర్‌ రావుపై స స్పెన్షన్‌ వేటు పడింది. కాంగ్రెస్‌ పార్టీ నుండి ఆరు సంవత్సరాల పాటు సస్పెండ్‌ చేస్తు కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్‌ కోదండరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మచ్చ సుధాకర్‌రావుకు కాంగ్రెస్‌ పార్టీ తరపున షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. గతంలో మచ్చ సుధాకర్‌రావుకు కాంగ్రెస్‌ పార్టీ తరుపున షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన షోకాజ్‌ నోటిసులు ఇచ్చిన ఆయన సమాదానంపై సంఘం సంతృప్తి చెందలేదు. దీంతో ఆయనపై వేటు పడింది. గతంలో సుధాకర్‌రావు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్‌రెడ్డిపై సోషల్‌ మిడియాలో సుధాకర్‌రావు విమర్శలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. 2021 ఫి బ్రవరిలో సుధాకర్‌రావుకు 12వ తేదిన షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.అయితే ఆయన సమాధానం సంతృప్తిగా లేదని చైర్మన్‌ భావించారు. దీంతో ఆరు సంవత్సరాల పాటు సుధాకర్‌ రావుపై వేటు వేశారు. సుధాకర్‌రావు ఏఐసిసి నేత వంశీపై విమర్శలు చేయడం హాట్‌ టాఫిక్‌గా మారింది. అదే విధంగా రేవంత్‌రెడ్డి పర్యటన ఇతర విషయాలతో పాటు పార్టీకి నష్టం జరిగే విధంగా సుధాకర్‌రావు వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం తన ప్రాంతంలో ఇతర నాయకులు రాజకీయ వ్యవహరాన్ని నడుపుతున్నారు. చాలా కాలంగా మచ్చ సుధాకర్‌రావు పార్టీ కార్యక్రమాలను వేరు వేరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ ప్రకటనతో రాజకీయ ప్రకంపనలు వెల్లువెత్తాయి. ఏది ఏమైనప్పటికి మచ్చ సుధాకర్‌రావు కాంగ్రెస్‌ పార్టీ నుండి వెళ్లిపోవడంతో మండలంలో రాజకీయ సమీకరణాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement