Friday, November 22, 2024

20న పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి తలసాని

హైదరాబాద్ : పంజాగుట్ట గ్రేవ్ యార్డుకు పాత ముఖద్వారాన్ని తొలగించి నూతనంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వలన స్మశానవాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగి పోతున్నాయి. పాత గేట్ నుండి హై టెన్షన్ విద్యుత్ పోల్ వరకు వెడల్పు చేసినందున నాగార్జున సర్కిల్ నుండి కేబీఆర్ పార్కు జంక్షన్ కు వెళ్లే వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా నేరుగా వెళ్లవచ్చు. గ్రేవ్ యార్డుకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందితో పాటుగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమ‌వడంతో జీహెచ్ఎంసీ శాశ్వత పరిష్కారం చేసేందుకు రూ.17 కోట్లను మంజూరు చేసి కేబుల్ బ్రిడ్జి, పాత గేట్ నుండి హెచ్.టి లైన్ వరకు రోడ్డు విస్తరించడం మూలంగా గతంలో ఏర్పడ్డ ట్రాఫిక్ సమస్య తీరనున్నది.
హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నది. తద్వారా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా ప్రజల అవసరాలు తీరుతున్నాయి. మొత్తం రోడ్డు విస్తీర్ణం 140 మీటర్లు కాగా అందులో అప్రోచ్ రిటర్నింగ్ వాల్ 57మీటర్లు, 9.6 మీటర్ల ఫ్లై ఓవర్ మొత్తం 46 స్టీల్ గ్రీడర్స్ ఏర్పాటు చేసి పనులను పూర్తి చేశారు. ఈ బ్రిడ్జిని 20వ తేదీన రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, శాసన సభ్యులు, ఎమ్మెల్సీ, ఎంపీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement