హైదరాబాద్: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు కొత్త ఏడాదిలో ప్రతి సోమవారం బుద్ధభవన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు
స్వీకరించనున్నారు. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వొచ్చని హైడ్రా పేర్కొంది. అక్రమణలకు సంబంధించిన పూర్తి వివరాలు, సర్వే నెంబర్లు, ఉంటే ఫోటోలు జత చేసి తమ ఫిర్యాదులను ఇవ్వవచ్చని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.. వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Complaint Cell – ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్న హైడ్రా
Advertisement
తాజా వార్తలు
Advertisement