మియాపూర్ : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ సమక్షంలో ప్రభుత్వవిప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, వివిధ శాఖల అధికారులతో అభివృద్దిపనులపై సమీక్ష నిర్వహించారు. ..ఈ సంధర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. స్థానిక అవసరాల దృష్ట్యా నిధులు మంజూరుచేసిన ప్రభుత్వ అదికారులు నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేయక పోవడం బాధాకరమని కాంట్రాక్టర్లపై ఆధారపడి పనులు చేయకపోవడం సరైన విధానం కాదని తెలిపారు. కమ్యునిటీ హాళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పాఠశాలలో అదనపు గదులకు మంజూరుచేసిన నిధులను ఉపయోగించి నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. గృహ నిర్మాణపధకంలో నమోదుచేసుకున్న లబ్దిదారుల వాటా చెల్లించిన ఇప్పటికి కేటాయింపులు జరగకపోవడం బాధాకరమని అక్రమ చోరవదారులపై చర్యలు తీసుకుని నిజమైన లబ్దిదారులకు అవకాశం కల్పించాలని తెలియజేశారు. పత్రికానగర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాలలో ఇంకా కొంతమందికి ఇండ్లు కేటాయించాల్సి ఉందని ప్రస్తుతం తాత్కాలిక వసతిలో ఉన్నారని తెలియజేశారు. ఈ సంధర్భంలో ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి భవనాలు నిర్మించాలని కలెక్టర్ గారిని కోరారు. ప్రభుత్వభూములలో కార్మిక భవనము, గ్రంధాలయము, బిసి హాస్టల్స్ (బాలుర, బాలికల) వసతి నిర్మాణానికి స్థల కేటాయింపు నిధుల మంజూరి ప్రతిపాదనలపై కలేక్టర్ సానుకూలంగా స్పందించారు. పోతుకూచి సోమసుందర సోషల్ వెల్పేర్ ట్రస్టుకు స్థలం కేటాయింపు కోరకు దరఖాస్తును పరిశీలించాలని ఈ సంధర్భంగా ఎమ్మెల్యే గాంధీ కోరారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అదికారులు ముఖ్య ప్రణాలిక అధికారి ఓంప్రకాశ్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మీ, గృహానిర్మాణ పధకం ప్రాజేక్టు అదికారి రాజశేఖర్‌రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ కృష్ణయ్య, జలమండలి డిజిఎం అశోక్, సిఐ మధుసూధన్‌రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement