కోకా-కోలా వారిచే ఇండియా అభిమాన నిమ్మ, నిమ్మ- రుచి గల పానీయం స్ప్రైట్, శాంతపరచే, చల్లబరచే అనుభవం కోసం వెళ్ళగల తాజా పానీయంగా తన స్థితిని సుస్థిరపరచుకోవడానికి ఒక కొత్త క్యాంపెయిన్ ని వెల్లడించింది. కొత్త క్యాంపెయిన్ గురించి కోకా-కోలా ఐఎన్ఎస్ డబ్ల్యూఏ, స్పార్క్లింగ్ ఫ్లేవర్స్ కేటగిరీ, సీనియర్ డైరెక్టర్ టిష్ కాండెనో మాట్లాడుతూ… 20 సంవత్సరాలకు పైగా, స్ప్రైట్ తనకు తానుగా వివాదరహితమైన యువత బ్రాండుగా పేరు పొందడమే కాకుండా, తన మార్కెటింగ్ ప్రయత్నాల ద్వారా అధీకృత, పదునైన, పట్టణ సంభాషణల్లో కూడా ఆధిపత్యం చెలాయిస్తోందన్నారు. స్ప్రైట్ వేసవి క్యాంపెయిన్ థండ్ రఖ్ (చల్లగా ఉంచండి) విజయంపై స్ఫూర్తిని పొంది, తమ కొత్త చిత్రం, మీ ఆటవిడుపు సందర్భాలు, వారాంతాలన్నింటికీ ఛిల్డ్ స్ప్రైట్ ఒక బాటిల్ ఎలా కచ్చితమైన భాగస్వామి అవుతుందో ప్రదర్శించి చూపడానికి ఒక చమత్కారమైన విధానాన్ని అనుసరిస్తుందన్నారు.
తాజాదనం కలిగించే పానీయం తీసుకోండి, అది అప్పటికప్పుడే మీ భావనను తేలికపరుస్తుంది అనే మూల సందేశాన్ని పునరుద్ఘాటించడాన్ని ఈ క్యాంపెయిన్ చిత్రీకరిస్తుందన్నారు. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రముఖ తారలలో ఒకరైన, విస్తృతంగా అభిమానించబడుతున్న నానితో భాగస్వామ్యం వహిస్తున్నందుకు తాము ఎంతగానో సంతోషిస్తున్నామన్నారు. తెలుగు సూపర్ స్టార్ నాని మాట్లాడుతూ… స్ప్రైట్ చేసినట్టుగా మిమ్మల్ని శాంతపరచే పానీయం మరొకటి లేదన్నారు. తీరికలేని షెడ్యూళ్ళతో సతమతమవుతున్న కళాకారుడిగా ఉన్నప్పటికీ కూడా, స్ప్రైట్ తనకు ఎల్లప్పుడూ తాజాదనపు ఎంపికగా ఉంటూ వస్తోందన్నారు. బ్రాండ్ కొత్త క్యాంపెయిన్ లో భాగమైనందుకు తాను చాలా సంతోషిస్తున్నానన్నారు.