Monday, November 18, 2024

12 రాష్ట్రాల వ్యాప్తంగా కోకా-కోలా ప్రాజెక్ట్ ఉన్నతి

ఆత్మనిర్భర్ భారత్ ఏర్పాటు దిశగా తన ప్రయత్నాలకు అనుగుణంగా కోకా-కోలా ఇండియా, దశాబ్దకాలంగా తన ప్రాజెక్ట్ ఉన్నతి విజయవంతమైన దశాబ్ద అమలు తీరును ప్రకటించింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నతి ప్రాజెక్టుల ద్వారా మంచి వ్యవసాయ పద్ధతులను అనుసరించడంతో అత్యంత అధిక సాంద్రత పళ్ళ మొక్కల పెంపకపు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 5 రెట్ల పళ్ళ ఉత్పాదకత పెంపొందగలిగింది.

ఈసంద‌ర్భంగా కోకా-కోలా కంపెనీ ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఆసియా కోసం సిఎస్ఆర్ అండ్ సుస్థిరత అంశాల డైరెక్టర్ రాజేష్ ఆయపిళ్ళా మాట్లాడుతూ… భారతీయ వ్యవసాయాధారిత ఆర్థిక స్థితికి రైతులు వెన్నెముక వంటి వారన్నారు. ప్రాజెక్ట్ ఉన్నతి ద్వారా ఈ రైతులకు అధునాతన పళ్ళతోటల సాగు పద్ధతులకు వీలు కల్పించడం ద్వారా వారి జీవనోపాధుల్ని వృద్ధి చేయడం, పెంపొందించడం మాత్రమే కాకుండా వారి ఆదాయాలు గణనీయంగా పెంచుకునేలా వారికి సాధికారత కల్పించడం త‌మ లక్ష్యంగా ఉంటోందన్నారు. వ్యవసాయాధారిత ఆర్థిక స్థితిని స్వయం-సమృద్ధం చేస్తూ, ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణ దిశగా భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఇది ఒక ముందడుగన్నారు. ఇండియాలో ఫల ఆవృత ఆర్థికస్థితిని సృష్టించే దిశగా కోకా-కోలా ఇండియా ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్ట్ ఉన్నతి మ్యాంగో తో 2011 లో మొట్టమొదటి అడుగు వేసిందన్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం 2018లో మహారాష్ట్రలో ఉన్నతి ఆరంజ్ కు పొడిగించబడిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement