హైదరాబాద్: హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జెండాఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వెహికిల్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement