భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్స్‌లో ఒకటైన క్లియర్ ట్రిప్ రాబోతున్న పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని ద బిగ్ బిలియన్ డేస్ లో భాగంగా భారతదేశంలో అతిపెద్ద ట్రావెల్ ఫెస్టివల్స్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా ద బిగ్ బిలియన్ డేస్‌ను క్లియర్ ట్రిప్ వేడుక చేయడం గురించి క్లియర్ ట్రిప్ సీఈఓ అయ్యప్పన్.ఆర్ మాట్లాడుతూ… పండుగ సీజన్ అంటేనే సెలవుల కాలం అంటారు. కుటుంబమంతా కలిసే కాలమిది.. ఈ ఆలోచనతోనే భారీ షాపింగ్ ఫెస్టివల్లో ఎలాంటి అనుభవాలను పొందుతున్నారో, అవే తరహా అనుభవాలు వినియోగదారులు, ట్రావెల్ పరిశ్రమకు అందించాలని అనుకున్నామన్నారు. కాకపోతే కాస్త వైవిధ్యంగా ఈ అనుభవాలను అందించాలనుకున్నామని తెలిపారు.
నాలుగు లేదా 5 స్టార్ హోటల్స్‌లో వసతిని ఊహించని వారు సైతం ఇప్పుడు ధైర్యంగా రూమ్‌లను బుక్ చేసుకునేలా వీటిని తీర్చిదిద్దామన్నారు. అదే రీతిలో పరిశ్రమలో సాటిలేని రీతిలో డీల్స్‌ను ఫ్లైట్స్‌పై కూడా అందిస్తున్నామన్నారు. తమ టీమ్‌లు 24 గంటలూ శ్రమించి తమ ప్లాట్‌ఫామ్‌పై సౌకర్యవంతమైన అనుభవాలను అందిస్తున్నారన్నారు. అంతేకాదు, వినియోగదారులకు మరింత సౌకర్యం అందిస్తూ నామమాత్రపు ఫీజుతో విమాన టిక్కెట్ల క్యాన్సిల్ లేదా మాడిఫై చేసుకునే అవకాశం అందిస్తున్నామన్నారు. ఈ భాగస్వామ్యం గురించి వారు మాట్లాడుతూ… క్లియర్ ట్రిప్‌తో భాగస్వామ్యం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. వారి తాజా ఔట్లుక్, ట్రావెల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తీరు పట్ల ఆనందంగా ఉన్నామన్నారు.