Saturday, November 16, 2024

పరిసరాల పరిశుభ్రత పాటించాలి : మంత్రి హరీశ్‌ రావు

ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త మ‌నంద‌రి బాధ్య‌త అని, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీవ్‌ రావు అన్నారు. డెంగీ నివారణలో భాగంగా.. మంత్రి తన నివాస ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్రపరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల తొట్లను క్లీన్‌ చేశారు. ప్రజలంతా ఇంట్లో నీళ్లు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. పగటిపూట దోమలు కుట్టడమే డెంగీకి ప్రధాన కారణమన్నారు. దీనిని ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. డెంగీ నివారణ చేపట్టేందుకు ప్రజలంతా ప్రతి ఆదివారం పది నిముషాలు కేటాయించి వారి ఇంటి చుట్టూ ఉన్న చెత్తా, చెదారం, నీళ్లు నిల్వ ఉండకుండా శుభ్ర పరుచుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement