Saturday, November 23, 2024

ప్రతీ ఆదివారం క్లీనింగ్… పరిసరాల పరిశుభ్రత పాటించాలి : మంత్రి సబితారెడ్డి

వర్షాలు కురుస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారణ కోసం “ప్రతి ఆదివారం ఉదయం 10:10 గంటలకు ఆదివారం విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఇంట్లో నీరు నిలువ ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసారు. ప్రజల అవగాహన కొరకై మంత్రి ఇంటిలోని పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలు కూడా స్వచ్చందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పేర్కొన్నారు. వర్ష కాలంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధులు అరికట్టడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సబ్ కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆదివారం ఇళ్లలో నిర్వహిస్తున్నట్లే విద్యాలయాల్లో ప్రతి ఫ్రైడే డ్రై డే నిర్వహిస్తూ పారిశుధ్యం పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతో గ్రామాల్లో పల్లె, పట్టణ ప్రగతి లో భాగంగా స్వచ్ఛగా మారి చాలా వరకు వ్యాధులు తగ్గాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వర్షాలతో పొంచి ఉన్న మలేరియా, డెంగ్యూ లు నీరు నిలువ ఉండటం వల్లనే వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో పాత్రలు, కుండీలు, పాత టైర్లలో నీటిని తొలగించాలని మంత్రి అన్నారు. పరిశుభ్రతతోనే ఈ వ్యాధులకు అడ్డుకట్ట వేయచ్చన్నారు.వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, డెంగ్యూ వ్యాధి కలుగజేసే ఎడిస్ దోమ మంచినీటిలో ఎక్కువగా గుడ్లు పెడతాయని అన్నారు.వారానికి మించి నీరు నిలువ ఉన్న టైర్లు కొబ్బరి బొండాలు వాడకుండా ఉంచిన రోలు పూల కుండీలు అడుగున ప్లేట్లు ప్లాస్టిక్ కప్పులు పగిలిన మట్టి కుండలు పాత ఫ్రిజ్ ల వెనక కింద భాగంలో కూలర్లు సిమెంట్ ట్యాంకులను వారానికి ఒక సారి శుభ్రం చేయాలని లేదంటే లార్వా ఏర్పడుతుందని మంత్రి అన్నారు. ప్రతి శుక్రవారం విద్యాలయాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి అన్నారు. అందులో భాగంగా ప్రతి పాఠశాల, కళాశాల లలో ఈ కార్యక్రమం నిర్వహించి వ్యాధులు ప్రబలకుండా చూడాలని అన్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేసారు. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, పరిశుభ్రత తో రోగాలు మాయం అవుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement