Sunday, November 17, 2024

HYD: అల్వాల్ కొత్తచెరువును పరిశీలించిన నగర మేయర్ విజయలక్ష్మి

అల్వాల్ : నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి జిహెచ్ఎంసి పరిధిలోని అల్వాల్ కొత్తచెరువును పరిశీలించారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం అల్వాల్ కొత్తచెరువు వద్ద ఉన్న బతుకమ్మ కుంటలో ఏర్పాట్లపై ఆయా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి మేయర్ పరిశీలించారు. వినాయక చవితి వచ్చేసరికి నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాలని అధికారులను మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు.

అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన వినాయక ఉత్సవాల సమీక్ష సమావేశంలో నిమజ్జనానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రహదారుల నిర్మాణం భద్రతా అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్, డీసీ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు రాజ్ జితేంద్రనాథ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఆయా విభాగాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement