Sunday, November 24, 2024

HYD: బ్రెయిన్‌ స్ట్రోక్‌ నుండి రోగిని రక్షించిన సిటిజన్స్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌

హైదరాబాద్‌ : సిటిజన్స్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ లో మల్టీడిసిప్లినరీ టీమ్‌ మేనేజ్‌ మెంట్‌ గురించి మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడింది. 50 ఏళ్ల పురుషుడు అధిక రక్తపోటు, తల తిరగటం, వాంతులు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు, స్పృహ కూడా క్షీణించగా, అత్యంత విషమ పరిస్థితుల్లో ఇంట్యూబేషన్‌, ఆసుపత్రిలో చేరాడు. ఆ రోగి సాయినాథ్‌ శెట్టి, లెప్ట్‌ కాడేట్‌ అని పిలువబడే, మెదడులోని నిర్దిష్ట ప్రాంతంలో రక్తస్రావం కలిగియున్నట్లు నిర్ధారణ అయింది. ఈ రక్తస్రావం మెదడులోని జఠరికల్లోకి విస్తరించింది.

న్యూరో సర్జన్‌ డాక్టర్‌ రాజేష్‌ రెడ్డి సనారెడ్డి, నిపుణుల మార్గ దర్శకత్వంలో, ప్రత్యేక వైద్యబృందం పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడానికి సాధారణ అనస్థీషియా కింద రైట్‌ ఫ్రంటల్‌ ఎక్స టర్నల్‌ వెంట్రిక్యులర్‌ డ్రెయిన్‌ విధానాన్ని వేగంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సిటిజన్స్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ న్యూరోసర్జన్‌ డా.రాజేష్‌ రెడ్డి మాట్లాడుతూ… శెట్టి కేసు అంకితమైన నర్సింగ్‌, ఫిజియోథెరపీ సేవలతో సహా సమయానుకూలంగా వ్యవహరించిన మల్టీడిసిప్లినరీ టీమ్‌ మేనేజ్‌ మెంట్‌ ప్రాముఖ్యతను చాటిందన్నారు. సిటిజన్స్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఆర్‌ సీవొవొ డాక్టర్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ… సిటిజన్స్‌ స్పెషాలిటీ హాస్పిటల్లో రోగులకు అత్యున్నతస్థాయి ఆరోగ్య సంరక్షణను అందించాలనే మా నిబద్ధతకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement